Site icon NTV Telugu

Governor Kambhampati Haribabu: విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఒడిశా గవర్నర్‌ సూపర్‌ ఐడియా..!

Kambhampati Haribabu

Kambhampati Haribabu

Governor Kambhampati Haribabu: విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు ఓ అదిరిపోయే ఐడియా చెప్పారు.. ముడి చమురు దిగుమతిని తగ్గించాలని సూచించారు.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి పునరుత్పాదక శక్తి వైపుకు అడుగులు వేయాలన్నారు.. సాంప్రదాయ ఇంధన వనరుల నుండి పునరుత్పాదక ప్రత్యామ్నాయాలకు మారాలని.. అప్పుడే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుందన్నారు.. ఇక, ఒడిశా రాజ్ భవన్ ప్రాంగణంలో 150 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ పనిచేస్తోంది, త్వరలో మరో 400 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం అన్నారు హరిబాబు.. గవర్నర్ నివాసాన్ని నెట్ జీరో ఇంధన క్యాంపస్ గా మార్చడానికి ఇది ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించిన ఆయన.. మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల వలన స్థిరమైన రవాణా దిశగా నిర్ణయాత్మక మార్పు జరుగుతోంది.. పీఎం-కుసుమ్ యోజన సౌరశక్తితో నడిచే పంపుసెట్లను ఏర్పాటు చేయడంలో రైతులకు సహాయ పడుతుందన్నారు.

Read Also: Health Tips: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక స్పూన్ నెయ్యి తింటే చాలు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు

పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన సబ్సిడీ ధరలకే ఇంటి పైకప్పు పైన సౌర విద్యుత్ పరికరాన్ని అమర్చడం ద్వారా ఇంటికి విద్యుత్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు గవర్నర్‌ కంభంపాటి హరిబాబు.. కేంద్ర ప్రభుత్వం ఒకటి, రెండు కిలోవాట్లకు ఒక్కో ఇంటికి 30 వేలు చొప్పున, మూడవ కిలోవాట్‌కు 18 వేల చొప్పున సబ్సిడీని అందిస్తుందని వెల్లడించారు.. ఆర్థిక సహాయం గరిష్టంగా 3 కిలోవాట్ల సామర్థ్యం వరకు ఉన్న వారికి అందుబాటులో ఉంటుంది.. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి అదనంగా 25 వేలు, మూడవ కిలోవాట్‌కు 10 వేలు సబ్సిడీని అందిస్తోందన్నారు.. 3 కిలోవాట్ల సౌర వ్యవస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి 1.38 లక్షల సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు.

Exit mobile version