NTV Telugu Site icon

Odisha : ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం, రేపు ప్రమాణస్వీకారం, సీఎం పేరుపై ఇంకా సస్పెన్స్

New Project (42)

New Project (42)

Odisha : ఒడిశాలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 147 మంది సభ్యులున్న అసెంబ్లీలో 78 సీట్లు గెలుచుకుని బీజేపీ మెజారిటీ సాధించింది. అయితే రాష్ట్ర పగ్గాలు చేపట్టే నాయకుడిని పార్టీ ఇంకా ఖరారు చేయలేదు. ఒడిశా సీనియర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్‌కు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి లభించిన తర్వాత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్‌లను బీజేపీ నియమించింది.

Read Also:Manipur : మణిపూర్ హింస.. డీజీపీకి భద్రత పెంచాలని లేఖ రాసిన రాష్ట్రప్రభుత్వం

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో చేసినట్లుగా బిజెపి నాయకత్వం ప్రజలను ఆశ్చర్యపరుస్తుందని ఇటీవల ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ఎవరూ ఊహించనటు వంటి పేర్లు ముఖ్యమంత్రి పదవికి ప్రకటించారు. అలాగే ఒడిశాలో కూడా జరుగుతుందని అంతా భావిస్తున్నారు. జూన్ 12న ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు రాష్ట్ర రాజధానిలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ప్రమాణస్వీకారోత్సవానికి నవీన్ పట్నాయక్‌ను పార్టీ రాష్ట్ర చీఫ్ మన్మోహన్ సమాల్ స్వయంగా ఆహ్వానిస్తారని ఒడిశా బీజేపీ జాతీయ పరిశీలకుడు విజయ్‌పాల్ సింగ్ తోమర్ తెలిపారు.

Read Also:Andhra Pradesh CM: బాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు

24 ఏళ్లుగా బీజేడీ ప్రభుత్వం
ఒడిశాను బిజూ జనతాదళ్‌కు కంచుకోటగా పిలుస్తారు. ఆయన ప్రభుత్వం 24 ఏళ్ల పాటు ఇక్కడ కొనసాగింది. ఈ సమయంలో నవీన్ పట్నాయక్ రాష్ట్రానికి నాయకత్వం వహించారు. తాను రాష్ట్ర బాధ్యతలు చేపట్టినప్పుడు ఇక్కడి జనాభాలో 70 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని, తన 24 ఏళ్ల పదవీ కాలంలో దాన్ని 10 శాతానికి తగ్గించారని పట్నాయక్ చెప్పారు. పట్నాయక్ తన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ, నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒడిశాలో 70 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని చెప్పారు. ఇప్పుడు కేవలం 10 శాతం మంది మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వ్యవసాయం, నీటిపారుదల రంగాలు, మహిళా సాధికారతలో తమ కృషి కారణంగా ఈ విజయం సాధించినట్లు చెప్పారు.