NTV Telugu Site icon

World Cup Trophy: పెళ్లి చేసుకున్నారు.. వన్డే ప్రపంచకప్‌ సాధించారు! పాంటింగ్‌, ధోనీ సరసన కమిన్స్‌

World Cup Trophy Marriage Sentiment

World Cup Trophy Marriage Sentiment

ODI World Cup Trophy Marriage Sentiment from 2003: ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ‘పెళ్లిళ్ల సెంటిమెంట్’ అంటూ ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి భారత్, ఆస్ట్రేలియా ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందే ఈ వార్త నెట్టింట హల్చల్ చేయగా.. చివరకు అదే నిజమైంది. పెళ్లైన మరుసటి ఏడాదే.. వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీ గెలిచారు కొందరు కెప్టెన్స్. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లలో 2003 నుంచి కొనసాగుతోన్న ఈ సెంటిమెంట్ 2023లో కూడా నిజమైంది. దాంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ దిగ్గజాల సరసన చేరాడు.

పెళ్లిళ్లు చేసుకున్న కెప్టెన్‌లు మరుసటి ఏడాదే ప్రపంచకప్‌లను అందుకుంటున్నారు. 2002లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ పెళ్లి చేసుకోగా.. 2003లో ఒన్డే ప్రపంచకప్ ట్రోఫీ అందుకున్నాడు. 2010లో భారత సారథి ఎంఎస్ ధోనీ వివాహం చేసుకోగా.. 2011లో తన జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 2018లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వివాహం చేసుకోగా.. 2019లో తన జట్టుకు మొదటి ట్రోఫీని అందించాడు.

ఈ సెంటిమెంట్ ఇక్కడితో ఆగకుండా 2023లో కూడా కంటిన్యూ అయ్యింది. 2022లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పెళ్లి చేసుకోగా.. ఈ ఏడాది తన జట్టుకు కప్ అందించాడు. దాంతో రికీ పాంటింగ్‌ (2003), ఎంఎస్ ధోనీ (2011), ఇయాన్‌ మోర్గన్‌ (2019) సరసన చేరిన కమిన్స్.. అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మరి 2026లో ఏ కెప్టెన్ పెళ్లి చేసుకుంటాడు? అని ఫాన్స్ సరదాగా ట్వీట్స్ చేస్తున్నారు. పెళ్లిళ్ల సెంటిమెంట్ ఇక్కడితో ఆగుతుందా? లేదా కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.

Also Read: World Cup 2023 Awards: ప్రపంచకప్‌ 2023లో అవార్డులు అందుకున్న ప్లేయర్స్ వీరే.. టీమిండియాకు ఆరు!

ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్స్ తేడాతో గెలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 240 పరుగులకే పరిమితమైంది. ట్రవిస్‌ హెడ్‌ (137) అద్భుత శతకంతో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇక నాలుగేళ్ళ తర్వాత వన్డే ప్రపంచకప్‌ 2027లో జరగనున్న విషయం తెలిసిందే.

Show comments