NTV Telugu Site icon

SA vs AFG: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గానిస్థాన్‌‌.. మరోసారి చెమటలు పట్టించేనా?

Sa Vs Afg

Sa Vs Afg

Afghanistan opt to bat vs South Africa: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి అఫ్గానిస్థాన్‌‌ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని హష్మతుల్లా తెలిపాడు. ఈ మ్యాచ్‌ కోసం దక్షిణాఫ్రికారెండు మార్పులు చేసింది. తబ్రేజ్‌ షంషి, మార్కో జన్సెన్‌లకు విశ్రాంతినిచ్చి.. వారి స్థానంలో ఆండిలే ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కోయెట్జీలను తుది జట్టులోకి తీసుకుంది.

అఫ్గానిస్థాన్‌‌ సెమీస్‌ చేరాలంటే ఈ మ్యాచ్‌లో 438 పరుగుల భారీ తేడాతో గెలవాల్సి ఉంది. అఫ్గాన్లకు ఇది స్థాయికి మించిన పనే. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటంతో అఫ్గానిస్థాన్‌‌కు ఈ దుస్థితి ఏర్పడింది. అయితే ఆస్ట్రేలియాకు మాత్రం చెమటలు పట్టించింది. ఆస్ట్రేలియా మాదిరే దక్షిణాఫ్రికాను ఆటాడుకునే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. దక్షిణాఫ్రికా సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

తుది జట్లు:
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (కీపర్‌), టెంబా బవుమా (కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.
అఫ్గానిస్థాన్‌‌: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీఖిల్ (కీపర్‌), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్.