NTV Telugu Site icon

AUS vs AFG: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్.. ఆస్ట్రేలియాకు సెమీస్‌ బెర్తు దక్కుతుందా?! అఫ్గాన్‌కే అవకాశాలు ఎక్కువ

Aus Vs Afg

Aus Vs Afg

Australia and Afghanistan Semi Final Chances for ODI World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకొవాలనుకుంటున్న ఆస్ట్రేలియా.. మెగా టోర్నీలో సంచలన విజయాలు సాధిస్తున్న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఆస్ట్రేలియాకే కాదు ఈ మ్యాచ్ అఫ్గానిస్థాన్‌కు చాలా కీలకం. ఆస్ట్రేలియాపై గెలిస్తే.. 10 పాయింట్స్ ఖాతాలో వేసుకుని అఫ్గాన్‌ సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

సెమీస్‌ బెర్తు దక్కుతుందా?:
ప్రపంచకప్ 2023లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా అయిదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా నెగ్గింది. ఆసీస్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు (అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌) ఆస్ట్రేలియా ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లకి ఒక్కటి గెలిచినా ఆసీస్ మూడో సెమీఫైనలిస్ట్‌ అవుతుంది. అఫ్గాన్‌పైనే గెలిచి సెమీస్ బెర్త్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే మెగా టోర్నీలో పెద్ద జట్లను ఓడించిన అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించడం అంత సులువేం కాదు. ఆసీస్‌ మిడిల్‌ ఆర్డర్‌ ప్రదర్శన కూడా ఆందోలన కలిగిస్తోంది.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

అఫ్గాన్‌కే అవకాశాలు ఎక్కువ:
మరోవైపు ప్రపంచకప్ 2023లో సంచనల విజయాలను అఫ్గానిస్థాన్‌ సాధిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి సెమీఫైనల్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో అఫ్గాన్‌ ఆడాల్సి ఉంది. రెండు పెద్ద జట్లే కాబట్టి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. ప్రస్తుతం న్యూజీలాండ్, పాకిస్తాన్ కంటే అఫ్గాన్‌కే సెమీస్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే రెండు పెద్ద జట్లతో ఆడనుండడమే అఫ్గాన్‌కు ప్రతికూలాంశం. 2 మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా మిగతా జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది.

Show comments