NTV Telugu Site icon

O Bhama Ayyo Rama: సుహాస్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న ‘నువ్వు నేను’ అనిత..!

15

15

హీరో సుహాస్.. మొదటగా షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి ఆ తర్వాత టాలీవుడ్ హీరోలలో ఒకటిగా మారిపోయాడు. ప్రతిసారి కొత్త కథనంతో ప్రేక్షకులను అరవిస్తున్నాడు హీరో సుహాస్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంటు దూసుకెళ్తున్నాడు ఈ హీరో. గత నెలలో విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా భారీ విజయన్నీ అందుకోగా.. ఇప్పుడు సుహాస్ మరో మూడు సినిమాలను చేతిలో ఉంచుకున్నాడు.

Also read: BRS Party: నిన్న దానం.. నేడు కడియం.. అనర్హత వేటుపై బీఆర్‌ఎస్‌ పిటిషన్‌

శ్రీరంగనీతులు, ప్రసన్న వదనం సినిమా షూటింగ్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇటీవల శ్రీరంగనీతులు సంబంధించిన ట్రైలర్ విడుదల అవ్వగా ప్రేక్షకులను ట్రైలర్ ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా హీరో సుహాస్ లీడ్ రోల్ గా ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాను మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి నిర్మాత దిల్ రాజు మొదటి క్లాప్ కొట్టాడు.

Also read: Mansukh Mandaviya: ఇంతకీ నీవు కేంద్ర మంత్రివా.. టీమిండియా ప్లేయర్వా..

ఈ సినిమాలో హీరో సుహాస్ సరసన తమిళంలో సూపర్ హిట్ సాధించిన జో మూవీ హీరోయిన్ మాళవిక మనోజ్ కథానాయకగా నటిస్తుండగా.. ప్రధాన పాత్రలో దివంగత హీరో ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను’ సినిమాలో నటించిన హీరోయిన్ అనిత ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ‘నువ్వు నేను’ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకున్నా.. అనిత పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులు హిందీ సీరియల్స్ లో నటించినప్పటికీ తిరిగి మళ్లీ సినిమాలలో రి ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు హైదరాబాదులో నేడు జరిగాయి.