NTV Telugu Site icon

Finn Allen Century: ఫిన్‌ అలెన్‌ ఊచకోత.. 16 సిక్స్‌లతో సెంచరీ! ప్రపంచ రికార్డు సమం

Finn Allen Century

Finn Allen Century

Finn Allen hits highest score by a New Zealand Cricketer in T20I Cricket: న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ ఊచకోత కోశాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 62 బంతుల్లోనే 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో సెంచరీ (137) చేశాడు. అలెన్‌ సెంచరీని 48 బంతుల్లోనే బాదాడు. అలెన్‌ బ్యాటింగ్‌కు పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. పాక్ స్టార్ పేసర్లు షాహిన్ అఫ్రిది, హరీష్ రవూఫ్ కూడా భారీగా పరుగలు సమర్పించుకున్నారు.

సెంచరీ చేసిన ఫిన్‌ అలెన్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్ హజ్రతుల్లా జజాయ్‌ సరసన నిలిచాడు. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్‌ 16 సిక్సర్లు బాదాడు. తాజాగా జజాయ్‌ రికార్డును అలెన్‌ సమం చేశాడు. జీషన్ కుకిఖేల్ (15), ఆరోన్ ఫించ్ (14) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. న్యూజిలాండ్‌ తరఫున టీ20ల్లో అలెన్‌దే (137) అత్యుత్తమ స్కోర్‌. దీనికి ముందు ఈ రికార్డు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (123) పేరిట ఉంది.

Also Read: IND vs AFG: అఫ్గాన్‌తో మూడో టీ20.. క్లీన్‌స్వీప్‌పై భారత్‌ కన్ను!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్‌ ఒక్కడే చెలరేగాడు. టిమ్‌ సీఫర్ట్‌ (31) పర్వాలేదనిపించగా.. డేవాన్ కాన్వే (7), డారిల్‌ మిచెల్‌ (8), మార్క్ చాప్‌మన్‌ (1), మిచెల్ సాంట్నర్‌ (4) విఫలమయ్యారు. అలెన్‌ విధ్వంసం ధాటికి షాహీన్‌ అఫ్రిది (4-0-43-1), హరీస్‌ రౌఫ్‌ (4-0-60-2), మొహమ్మద్‌ నవాజ్‌ (4-0-44-1) 10కి పైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ 20 ఓవర్లలో ౭ వికెట్ల నష్టానికి 1 79 పరుగులు చేసి ఓడింది.