NTV Telugu Site icon

Top Headlines @ 9pm : టాప్‌ న్యూస్‌

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

పండుగ పూట కస్టమర్లకు ఎస్బీఐ షాక్.. లోన్స్ ఇక కాస్లీ

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ (ఎస్‌బీఐ) పండుగపూట కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. బ్యాంక్ తన రుణ రేట్లను అంటే MCLRని మళ్లీ పెంచుతున్నట్లు ప్రకటించింది.ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలకు ఈ రేటును పెంచారు. MCLR పెరిగిన తర్వాత, గృహ రుణం, వాహన రుణం లేదా వ్యక్తిగత రుణం వంటి అన్ని రకాల రుణాలు ఖరీదైనవి అవుతాయి.

బేసిస్ పాయింట్లు పెరిగింది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్లు (MCLR) 10 బేసిస్ పాయింట్లు లేదా 10 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు, ఈ పెంపు వివరాలను బ్యాంక్ తన అధికారిక వెబ్ సైట్లో ఉంచింది. గత డిసెంబరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత, ఇతర బ్యాంకుల మాదిరిగానే, SBI కూడా MCLR ను పెంచింది. SBI 15 డిసెంబర్ 2022న లోన్ రేట్ల పెంపును అమలు చేసింది.ఇప్పుడు ఒక నెల తర్వాత మళ్లీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది

అధికారిక లాంఛనాలతో ముకర్రమ్ ఝా అంత్యక్రియలు

హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ గారి మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ ఝా (Mukarram Jah) మరణం పట్ల సీఎం కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.నిజాం వారసుడుగా, పేదల కోసం విద్య, వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. టర్కీలోని ఇస్తాంబుల్ లో శనివారం రాత్రి మరణించిన ముకర్రమ్ ఝా పార్థివ దేహం హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత, వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఏ.కె.ఖాన్ ని సీఎం సూచించారు.

వందే భారత్.. విప్లవాత్మక మార్పుకు నాంది: జీవీఎల్‌

దేశంలోని రైలు ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ప్రధాని మోడీ ఆలోచనతో వచ్చిందే వందే భారత్ ట్రైన్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ట్రైన్‌కు ఘనంగా స్వాగతం పలికిన అనంతరం అందులో ఏలూరు వరకు ప్రయాణించిన జీవీఎల్.. పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఈ వందే భారత్ ట్రైన్‌ని కేంద్రం తీసుకొచ్చిందని అన్నారు. ఏసీ బస్సుల్లో ప్రయాణానికి ఎంత చార్జీ అవుతుందో, అంతే చార్జీలతో ఈ అత్యాదునిక ట్రైన్లలో ప్రయాణించవచ్చని తెలిపారు. విదేశాలతో పోలిస్తే.. భారత్‌లోనే రైలు చార్జీలు చాలా తక్కువ అని చెప్పారు. విదేశాల్లో ప్రీమియం ట్రైన్ చార్జీలు.. విమాన చార్జీల కంటే ఐదు రెట్లు అధికంగా ఉంటాయని.. మన దేశంలో నడుస్తున్న వందే భారత్ ట్రైన్ చార్జీలు ఫ్లైట్ చార్జీల్లో 4వ వంతు మాత్రమేనని స్పష్టం చేశారు.

క్లీన్ స్వీప్.. లంక బ్యాటర్లు చిత్తు.. భారత్ ఘనవిజయం

గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ కుదిర్చిన 391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 73 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ ఏకంగా 317 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక టపీటపీమంటూ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. ఏ ఒక్కరూ కూడా పోరాటపటిమ కనబర్చలేదు. బ్యాటర్లందరూ వచ్చినట్టే వచ్చి పెవిలియన్ బాట పట్టారు. నువానిదు ఫెర్నాండో 19 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడంటే.. లంక బ్యాటర్లు ఎంత పేలవ ప్రదర్శన కనబరిచారో మీరే అర్థం చేసుకోండి.

తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంపిక చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (116), విరాట్ కోహ్లీ (166) శతకాలతో చెలరేగడంతో.. భారత్ తన స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అంతకుముందు ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ (42) సైతం శుబ్మన్‌తో కలిసి శుభారంభాన్ని అందించాడు. రోహిత్ ఔటయ్యాక బరిలోకి దిగిన కోహ్లీ.. శుబ్మన్‌తో కలిసి లంక బౌలర్లతో ఓ ఆటాడుకున్నారు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్‌కి ఏకంగా 131 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. శుబ్మన్ ఔటయ్యాక శ్రేయస్‌తో కలిసి కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. సెంచరీ చేసుకున్నాక.. లంక బౌలర్లపై తాండవం చేశాడు. దీంతో.. అప్పటివరకు నత్తనడకన నడిచిన భారత్ స్కోర్ బోర్డు, ఆ తర్వాతి నుంచి తారాజువ్వలా దూసుకెళ్లింది.

పండగ రోజు సీఎంకు తప్పిన ముప్పు.. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

సంక్రాతి పండుగ రోజు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల టేకాఫైన ప్రదేశానికే తిరిగి వచ్చి ల్యాండ్‌ అయ్యింది. ధార్​ వెళ్లేందుకు హెలికాప్టర్​ మనావర్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్… కొంత దూరం ప్రయాణించగానే సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల వెంటనే తిరిగి వెనక్కి వచ్చినట్లు సబ్-డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ ధీరజ్​బబ్బర్ తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​చౌహాన్​ రోడ్డు మార్గంలో ధార్‌కు వెళ్లినట్లు చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో మనావర్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్‌కు బయలుదేరారు. మనావర్‌లో ఓ కార్యక్రమం అనంతరం ధార్ జిల్లాలో జరిగే బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించాల్సి ఉంది.

కేసు విషయంలో స్టేషన్‎కు తీసుకుపోతే.. పోలీసులపై బాంబ్ వేసి పరారయ్యాడు

పలుకేసుల్లో నిందితుడిని విచారణ నిమిత్తం స్టేషన్ కు తీసుకెళ్లే పోలీసులపై బాంబు వేసి పరాయ్యాడు.తిరిగి ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతగాడి కోసం గాలింపే చేపట్టారు. ఈ ఘటన కేరళలోజరిగింది. వివరాల్లోకి వెళితే.. పోలీసులపై బాంబు విసిరిన కేసులో నిందితుడు షఫీక్‌ను అరెస్టు చేశారు.ఆర్యనాడులో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో దాక్కుని ఉండగా పట్టుకున్నారు.ఉదయం ఆ ఇంటి కుటుంబీకులు రాగానే షఫీక్ వారిపై దాడి చేశాడు.ఇంటి యజమాని తలపై రాయితో కొట్టి బావిలో పడేశాడు.ఆపై గొడవ విన్న స్థానికులు షఫీక్‌ను పోలీసులకు అప్పగించారు.అతనితో పాటు ఉన్న మరో నిందితుడు అబిన్ పారిపోయాడు.