*తొలిరోజు చంద్రబాబుపై 50 ప్రశ్నలు సంధించిన సీఐడీ బృందం
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలిరోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులోనే అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఆయన్ను ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించింది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో ఈ విచారణ కొనసాగింది. విచారణకు ముందు, తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు దాదాపు 6 గంటల పాటు సీఐడీ చంద్రబాబును విచారించింది. సీమెన్స్ ఒప్పందాలు, లావాదేవీలపై సీఐడీ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు చెప్పిన ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ టైపిస్ట్‌తో టైప్ చేయించి సీఐడీ నివేదిక సిద్ధం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటలతో సీఐడీ విచారణ ముగించింది. చంద్రబాబు విచారణ అంతా సీఐడీ వీడియో రికార్డింగ్ కూడా చేసింది. సీఐడీ డీఏస్పీ ధనుంజయుడు నేతృత్వంలో రెండు బృందాలుగా సీఐడీ అధికారులు విచారించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులోని కీలకమైన ఆధారాలు కలిగిన 473 పేజీల పత్రాలు చంద్రబాబు ముందు ఉంచి సీఐడీ బృందం విచారణ జరిపింది. 120 ప్రశ్నాలతో విచారణకు వెళ్లిన సీఐడీ బృందం.. తొలి రోజు చంద్రబాబుపై 50 ప్రశ్నాలు సంధించించినట్లు తెలిసింది. విచారణ అనంతరం సెంట్రల్ జైలు నుంచి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కి సిఐడి బృందం వెళ్లింది. రేపు రెండో రోజు చంద్రబాబును సీఐడీ విచారించనుంది. ఈ రోజు మిగిలిన ప్రశ్నలను రేపు సంధించనున్నట్లు సమాచారం.
*గజవాహనంపై మలయప్ప స్వామి దర్శనం
తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు.ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. గజవాహనంలో మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. గజవాహనంలో ఊరేగుతున్న స్వామి వారి దర్శనం చేసుకుంటే కర్మం నుంచి విముక్తి లభిస్తుందని పురాణాల్లో ఉంది. భక్తులు కూడా విశ్వసిస్తారు. గజవాహనంపై మాడా వీధుల్లో ఊరేగుతూ.. స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. గజవాహనంలో ఊరేగుతున్న స్వామివారిని దర్శిస్తే.. కర్మం నుంచి విముక్తి లభిస్తుందని పురాణాల్లో ఉంది. భక్తులు కూడా విశ్వసిస్తారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. రామావతారంతో ఆంజనేయునిపై ఆసీనులై విహరిస్తున్న స్వామి వారిని దర్శించునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
*టీఎస్పీఎస్సీ సమర్పించిన కౌంటర్ పై తెలంగాణ హైకోర్టు అసహనం
గ్రూప్-1 రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలంగాణ హైకోర్టు చూపింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రతి నిబంధనను తప్పకుండా పాటించాల్సిందిగా టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను గైడ్ లైన్స్ ప్రకారం నిర్వహించలేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్షను మరోసారి నిర్వహించి నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని నిబంధనలు పాటించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ తో పాటు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని సూచనలను తప్పకుండా పాటించాలని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అభ్యర్థుల డేటాను సేకరించడంలోనూ టీఎస్పీఎస్సీ విఫలమైంది అని ఉన్నత న్యాయస్థానం చెప్పింది. గ్రూప్-1 పరీక్ష అభ్యర్థులకు ఎంత ప్రాముఖ్యమో తెలిసి కూడా టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వహించింది.. టీఎస్పీఎస్సీ సమర్పించిన కౌంటర్ పై హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను సైతం టీఎస్పీఎస్సీ తప్పుగా చూపించిందని న్యాయస్థానం తెలిపింది. జూన్ 28న 2, 33, 506 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ ఇచ్చింది. కానీ కౌంటర్లో మాత్రం 2,33, 248 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు తెలిపింది అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
*తెలంగాణలో మరో భారీ పెట్టుబడి..
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి రానుంది. సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో రూ. 350 కోట్లు పెట్టుబడిని పెట్టనుంది. వెల్ స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ తన తయారీ యూనిట్ కోసం దాదాపు రూ. 350 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు రెడీ అయింది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ తయారీ కేంద్రం నుంచి సింటెక్స్ వాటర్ ట్యాంకులను, ప్లాస్టిక్ పైపులను, ఆటో కాంపోనెంట్స్, ఇతర పరికరాలను తయారు చేయనున్నారు. ఈ కంపెనీ తయారీ ప్లాంట్ శంఖుస్థాపన కార్యక్రమం సెప్టెంబర్ 28న చేయనున్నారు. వెల్ స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా, మంత్రి కేటీఆర్ హజరుకానున్నారు. ఇప్పటికే.. తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టి సక్సెస్ ఫుల్ గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వెల్ స్పన్ గ్రూప్ తెలంగాణలో మరింతగా విస్తరించేందుకు ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వెల్ స్పన్ గ్రూప్ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో అదనంగా దాదాపు 350 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నందుకు కంపెనీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ఉన్న అద్భుతమైన మౌలిక వసతుల కల్పనే.. అనేక నూతన పెట్టుబడులను రాష్ట్రానికి తరలి వచ్చేలా చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ కార్యకలాపాలను, తమ పెట్టుబడులను విస్తరించడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా తెలుసుకుంటున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు.
*ఈనెల 30న మహబూబ్ నగర్ కు ప్రధాని మోడీ రాక..!
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. అంతకు ముందే.. అనగా.. సెప్టెంబర్ 30వ తారీఖున ఆయన తెలంగాణకు వస్తున్నారు. మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే, ఈ నెల 30వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ప్రధాని మోడీ సభను 2023 ఎన్నికల శంఖారావం సభగా బీజేపీ రాష్ట్ర నేతలు అంటున్నారు. బహిరంగ సభను చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ నాయకులు తీసుకున్నారు. ఈ బహిరంగ సభకు కనీసం లక్ష మందిని తరలించేలా జన సమీకరణపై దృష్టిపెట్టారు. ఇక, బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నేతలు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ శ్రేణులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని గ్రామాల్లోకి తీసుకువెళ్లి.. మరీ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును, కాంగ్రెస్ గ్యారెంటీలపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజల్లో బీజేపీ అవగాహన కల్పిస్తుంది.
*కర్ణాటకలో కావేరి చిచ్చు.. బెంగళూర్ బంద్‌కు పిలుపు
కావేరీ నీటి వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తమిళనాడుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు తప్పుపడుతున్నారు. నీటి విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 300కు పైగా సంస్థలు మంగళవారం బెంగళూర్ బంద్ కి పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే మరోవైపు మాండ్యా జిల్లాలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరికొన్ని సంఘాలు బందుకు పిలుపునిచ్చే యోచనలో ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకుడు చంద్రూ మాట్లాడుతూ.. తమ డిమాండ్‌లన్నింటిని నెరవేర్చాలంటూ టౌన్ హాల్ నుంచి మైసూర్ బ్యాంక్ సర్కిల్ వరకు వెళ్లి కర్ణాటక ప్రభుత్వానికి మెమోరాండం ఇస్తామని చెప్పారు. తమిళనాడుకు కావేరి నీటి విడులను నిలిపివేయడంతో పాటు సమస్యపై అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై ఉపముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఈ ఆందోళనల్లో రాజకీయ కోణం ఉందని, కర్ణాటక రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తాము ఉన్నామని అన్నారు. బంద్ కు పిలుపునివ్వవద్దని ఆందోళనకారుల్ని కోరారు. తమిళనాడుకు 5000 క్యాసెక్కుల నీటని విడుదల చేయాలని ఆదేశిస్తూ కావేరీ వాటార్ మేనేజ్మెంట్ బోర్డు (సీడబ్ల్యుఎంఏ) ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది.
*ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి విభాగమైన ‘అఖిల భారీతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)’ సత్తా చాటాంది. కీలక స్థానాలను గెలుచుకుంది. శనివారం సాయంత్రం ఓట్ల లెక్కింపు ముగియగా.. నాలుగు సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్లో మూడింటిని ఏబీవీపీ కైవసం చేసుకుంది. కేవలం ఒక సీటును ఎన్ఎస్‌యూఐ గెలుచుకుంది. అధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ పోస్టులను ఏబీవీపీ కైవసం చేసుకుంది. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్(ఎన్ఎస్‌యూఐ) అభ్యర్థి హితేష్ గులియాను ఓడించి ఏబీవీపీ అభ్యర్థి తుషార్ దేధా ఢిల్లీ యూనివర్సిటీ అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ స్థానాలను ఏజీవీపీకి చెందిన అపరాజిత, సచిన్ బైస్లా గెలుచుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ పోస్టును ఎన్ఎస్‌యూఐ కి చెందిన అభిదహియా గెలిచారు. నాలుగు స్థానాలకు మొత్తం 24 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 42 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం లక్ష మంది విద్యార్థులు ఓటు హక్కును కలిగి ఉన్నారు. చివరిసారి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్(డీయూఎస్‌యూ) ఎన్నికలు చివరిసారిగా 2019లో జరిగాయి. అప్పుడు ఏబీవీపీ నాలుగు స్థానాల్లో మూడింటిని గెలుచుకుంది. గెలుపొందిన అభ్యర్థులకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ప్రచారం చేశారు, ఇది ఏబీవీపీ ఓటు షేర్ ని పెంచిందని. ఏబీవీపీ అభ్యర్థులకు అభినందనలు’’ అని ట్వీట్ చేశారు.
*కమల్ హాసన్ పార్టీతో డీఎంకే పొత్తుపై ఉదయనిధి కీలక వ్యాఖ్యలు..
కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’తో డీఎంకే పొత్తుపై ఆ రాష్ట్ర మంత్రి, సీఎం కుమారుడు ఉదయనిధి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే డీఎంకే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పొత్తుపై మాట్లాడుతూ.. ఇది పార్టీ అంతర్గత విషయమని, ఇందులో వేర్వేరు పార్టీలున్నాయని తాను చూడనని, రెండింటిని ఒకే పార్టీగా చూస్తానన్నారు. కమల్ హాసన్ పార్టీలో పొత్తు ఉంటుందో లేదో అనే విషయాన్ని ఎన్నికల ముందు డీఎంకే పార్టీ నేతలు నిర్ణయిస్తారని ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. మరోవైపు సనాతనధర్మం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆదేశాలను మీడియాలో చూశానని, ఇంకా నోటీసులు అందలేదని, సుప్రీంపై నమ్మకం ఉందని, నోటీసులు అందిన తర్వాత తగిన వివరణ ఇస్తానని ఆయన చెప్పారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను, సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా వంటిదని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించి నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ మద్దతుగా నిలిచారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, ఉదయనిధిలాంటి చిన్న పిల్లవాణ్ని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. పెరియార్ వల్లే సనాతనం అందరికీ తెలిసిందని, పెరియార్ ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన తమిళనాడు సొంతమని కమల్ అన్నారు.
*సీరియల్ బ్యాచ్ ను కడిగిపడేసిన నాగ్ .. సందీప్ కు భారీ షాక్..
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడోవారం ఎలిమినేషన్ కు రంగం సిద్ధం చేశారు.. వీకెండ్ అంటేనే హౌజ్‌మేట్స్‌పై హోస్ట్ నాగార్జున వేసే పంచులు, కౌంటర్లే గుర్తొస్తాయి. అయితే ఈవారం మాత్రం అలా జరగడం లేదనిపిస్తోంది.. నాగ్ కాస్త సీరియస్ గా క్లాస్ ఇచ్చాడు.. గట్టిగా ఇవ్వడంతో జనాలు కూడా షాక్ అవుతున్నారు.. ముఖ్యంగా హౌజ్‌లో సీరియల్ బ్యాచ్ గా పేరొందిన అమర్ దీప్ చౌదరి, శోభాశెట్టిలపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు నాగార్జున. అలాగే సంచాలక్ సందీప్‌ను కూడా ఓ ఆటాడేసుకున్నారు. నాగ్ అడిగిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన కంటెస్టెంట్లు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ముందుగా అమర్‌దీప్‌తో మొదలెట్టాడు నాగ్.. అదే విధంగా ప్రియాంక, అమర్ పై నాగ్ సీరియస్ అయ్యాడు.. అసలు నువ్వు నీకోసం గేమ్ ఆడుతున్నావా? ప్రియాంక కోసం ఆడుతున్నావా?’ అంటూ అమర్‌దీప్‌కు ఇచ్చిపడేశారు నాగ్. దీనికి మాధానిమిస్తూ ‘నేను నాకోసమే గేమ్ ఆడుతున్నాను’ అని అమర్ చెప్పాడు. అదే సమయంలో ప్రశాంత్ పల్లవి టాపిక్‌ను మధ్యలోకి తీసుకొచ్చారు.. అతన్ని కూడా నాగ్ గట్టిగానే అడిగాడు.. అనంతరం శోభాశెట్టిపై కూడా ఓ రేంజులో ఫైర్ అయ్యారు నాగార్జున. వీకెస్ట్ కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేయమన్నావ్? మరి.. ప్రిన్స్ యావర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి సైడ్ చేశావ్.. అంటే నువ్వు వీక్ కంటెస్టెంట్ అని అంగీకరించినట్టేనా?’ అని నాగ్ అడగ్గా శోభ నీళ్లు నమిలింది. ఇక హౌజ్‌లో సంచాలక్‌గా సందీప్ పూర్తిగా ఫెయిలయ్యాడని నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గేమ్ మధ్యలో నువ్వు అస్సలు ఇన్వాల్వ్ కాకూడదు. మరి నువ్వు ఎందుకు కంటెస్టెంట్స్‌కు పాయింట్స్ ఇస్తున్నావ్’ అని నాగ్ ప్రశ్నకు సందీప్ తెల్లమొహం వేశాడు. సంచాలక్‌గా సందీప్‌పై హౌజ్‌మేట్స్ ఓపినియన్స్‌ను తీసుకుని అతని బ్యాటరీ లెవెల్ గ్రీన్ నుంచి ఎల్లోకు తగ్గించాడు.. ఇక వచ్చే వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడా
