నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ
ఆంధ్ర ప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. నేటి ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ బయలుదేరి ప్రత్యేక విమానంలో 9:50 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో 10.30 గంటలకు చింతపల్లి మండలం చౌడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో ఆయన దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా చౌడిపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు చేరుకోనున్నారు. ఇక, చౌడిపల్లి గ్రామంలో గిరిజన విద్యార్థులకు సీఎం జగన్ ట్యాబులు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి రోడ్డు మార్గం ద్వారా చేరుకొని స్మాల్ టెక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లెర్నింగ్ అండ్ టీచింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఉదయం 11. 20 గంటలకు ప్రత్యేక సభ ప్రాంగణంలోకి చేరుకోనున్నారు. అక్కడ 40 నిమిషాల పాటు గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతారు.. అనంతరం మధ్యాహ్నం 12: 30 గంటలకు సభా ప్రాంగణం నుంచి హెలిప్యాడ్‌కు చేరుకోని.. అక్కడే దాదాపు 30 నిమిషాలు స్థానిక నాయకులతో సీఎం జగన్ మాట్లాడుతారు. అయితే, సీఎం జగన్ మధ్యా్హ్నం 1: 30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని.. అక్కడి నుంచి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ, పలువురు అధికారులు పర్యవేక్షించారు.
శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు సర్వదర్శనం టోకెన్లు రద్దు..
తిరుమల తిరుపతిలో రేపు సర్వ దర్శనం భక్తులకు జారి చేసే టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. ఇక, రేపు మధ్యహ్నం నుంచి సర్వ దర్శనం భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది. పది రోజులకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలలో 4. 25 లక్షల టోకేన్లు జారీ చేసేందుకు దేవస్థానం బోర్డు సన్నాహాలు చేపట్టింది. అయితే, ఎల్లుండి నుంచి జనవరి 1వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. ఇందులో భాగంగానే పది రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల స్వీకరణను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేశారు. పది రోజుల పాటు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఎల్లుండి ఉదయం స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇక, 24వ తేదిన వేకువ జామున పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం కొనసాగనుంది. అలాగే, పది రోజుల పాటు టోకెన్ కలిగిన భక్తులుకు మాత్రమే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు. ఆన్ లైన్ విధానంలో ఇప్పటికే పూర్తి అయిన ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శన టిక్కెట్లను టీటీడీ విక్రయాలు జరిపింది. అయితే, రేపు మధ్యహ్నం నుంచి ఆఫ్ లైన్ విధానంలో సర్వ దర్శనం భక్తులకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించనుంది.
ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి.. భార్యను చంపిన భర్త! కనిపించట్లేదని డ్రామా
18 ఏళ్లుగా కలిసి జీవించిన భార్యను భర్త అతి కిరాతకంగా చంపాడు. ఆపై భార్య కనిపించట్లేదని డ్రామాలాడాడు. చివరకు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో చోటుచేసుకుంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న మియాపూర్ పోలీసులు.. భర్తను రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్, ఎస్సై గిరీష్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన రాజేశ్వరి (38)కి అదే జిల్లా రుద్రురు మండల కేంద్రానికి చెందిన కార్పెంటర్ రాజేష్‌తో 2005లో వివాహమైంది. రాజేష్ బతుకుదెరువుకు హైదరాబాద్ వచ్చి.. మియాపూర్‌లో ఉంటున్నాడు. రాజేష్, రాజేశ్వరిలకు ఇద్దరు కుమారులు. పిల్లలు బోధన్‌లో రాజేశ్వరి తల్లి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. 18 ఏళ్ల వైవాహిక జీవితం సాఫీగానే సాగినా.. భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా రాజేశ్వరి అడ్డు తొలగించుకోవాలని డిసెంబర్ 10న గండిమైసమ్మ ప్రాంతంలో ఓ ఫంక్షన్ ఉందని రాజేష్ బైకుపై తీసుకెళ్లాడు. బౌరంపేట సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీస్ ప్రాంతానికి రాజేశ్వరిని తీసుకెళ్లి.. తలపై రాయితో కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడేసి.. మియాపూర్‌లోని ఇంటికి వచ్చాడు. 12న రాజేశ్వరి తల్లి, సోదరికి ఫోన్ చేసి.. తన భార్య కనిపించడం లేదని రాజేష్ నాటకం మొదలుపెట్టాడు. కంగారుపడిపోయిన రాజేశ్వరి తల్లి.. డిసెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో.. అసలు విషయం వెలుగు చూసింది. రాజేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. రాజేష్‌ను రిమాండ్‌కు తరలించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి..
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచుతో కప్పి ఉంటుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలిగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈసారి ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాల్లోనూ 2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలు చోట్ల 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు పడిపోయాయి. సాధారణంగా ఈ టైంలో 26 నుంచి 28 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఉండాల్సింది.. కానీ, ప్రస్తుతం 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గిపోయాయి. ఉపరితల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరుగె అవకాశం ఉంది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో వాతావరణం చల్లగా ఉంటోంది. రాత్రిపూట కాకుండా పగలు కూడా చలిగాలులు వణికిస్తున్నాయి. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని కారణంగా ఇవాళ, రేపు తెలంగాణలో పొడి వాతవరణం ఏర్పాడే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు మాత్రం చలి విషయంలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జైలుకి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్… 14 రోజుల రిమాండ్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంప్లీట్ అయ్యింది. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి హోస్ట్ కింగ్ నాగార్జున “ఉల్టాపుల్టా” అని చెప్పినట్లు… షో కన్నా పోస్ట్ షో జరుగుతున్న విషయాలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ రోజు నుంచి ఇప్పటివరకు స్టేట్ లో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. సీజన్ 7 విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసారు, అతను పరారీలో ఉన్నాడు అనే వార్త బయటకి రావడంతో… ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే హైడ్రామా తర్వాత పల్లవి ప్రశాంత్ మరియు అతని సోదరుడునీ పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేసారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం పలు సెక్షన్ ల కింద కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్, అతని సోదరుడిని గజ్వేల్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఆరు గంటల పాటు విచారించిన తర్వాత… నిన్న రాత్రి జడ్జి ముందు పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశ పెట్టారు. 17వ మెట్రో పాలిటెన్ న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ & సోదరుడిని చంచల్గూడా జైల్ తరలించారు. శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసిపి మాట్లాడుతూ… “పల్లవి ప్రశాంత్ & సొదరుడు మహా విర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాము, 14రోజుల పాటు మెజిస్ట్రేట్ వారు రిమాండ్ విధించారు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మహా విరాన్ లను గజ్వేల్ లో అరెస్టు చేసి నేరుగా మెజిస్ట్రేట్ వారి ఎదుట హాజరు పరిచాము. కేసు దర్యాప్తులో ఉంది, మిగతా వారిని గుర్తిస్తున్నాము. అన్నపూర్ణ స్డూడియో దగ్గర గొడవ కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేశాము. పోలీసులు చెప్పిన వినకుండా, పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బందోబస్తుకు వెళ్లిన పోలీసుల కార్లు సహా, ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్, తదితరులపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాము. మొదట పల్లవి ప్రశాంత్ కారు డ్రైవర్లు సాయికిరణ్, రాజులను అరెస్టు చేశామని చెప్పారు.
సలార్ కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం సలార్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని కూడా సినిమాకు హైఫ్ ను క్రియేట్ చేశాయి.. విడుదల తేదీ దగ్గరపడటంతో సినిమా పై ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇదిలా ఉండగా.. డార్లింగ్ బాహుబలి సినిమాతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. అలాగే తర్వాత చేస్తున్న సినిమాలకు రెమ్యూనరేషన్ కూడా భారీ పెంచేసాడు.. ఇప్పుడు ప్రభాస్ నటించే ప్రతి సినిమాకు ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు..ఇక దాంతో ఏకంగా ఇప్పుడు ఆయన సలార్ సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూన్ రెషన్ తీసుకున్నాడని టాక్ అయితే సోషల్ మీడియా నడుస్తుంది… బాహుబలి సినిమా కోసమే ఆయన 100 కోట్ల రేమ్యున్ రేషన్ తీసుకున్నాడు కాబట్టి ప్రభాస్ ప్రస్తుతం 100 కోట్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని మరి కొందరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
దక్షిణాఫ్రికా, భారత్ మూడో వన్డే నేడు.. తెలుగు ఆటగాడిపై వేటు!
మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. పార్ల్ వేదికగా గురువారం జరిగే చివరి వన్డేలో దక్షిణాఫ్రికాను భారత జట్టు ఢీకొంటుంది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో చివరి పోరులో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకోనుంది. మరి నిర్ణయాత్మక పోరులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని యువ భారత్ చుస్తోంది. భారత్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఒక్కసారి (2018లో) మాత్రమే వన్డే సిరీస్ గెలుచుకుంది. అటు దక్షిణాఫ్రికా పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4.30కి ఆరంభం కానుంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ భారత్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ 5, 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. దాంతో నిర్ణయాత్మక వన్డేలో రుతురాజ్ చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. కొత్త కుర్రాడు సాయి సుదర్శన్ బాగా ఆడుతున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో 55, 62 పరుగులతో ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ ఆట కూడా కలవరపెడుతోంది. పరుగుల వేటలో బాగా వెనుకబడ్డాడు. చివరి అవకాశంగా ఈ మ్యాచ్‌లో తిలక్‌ను ఆడిస్తారా?.. లేదా రజత్ పటీదార్‌కు అవకాశం ఇస్తారా? అన్నది చూడాలి. సంజు శాంసన్‌కు మరో అవకాశం దక్కొచ్చు. రింకూ సింగ్, అక్షర్ పటేల్ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ పుంజుకోవాల్సివుంది. అర్ష్‌దీప్, అవేష్ విజృంభించాలని జట్టు కోరుకుంటోంది.