NTV Telugu Site icon

Top Headlines@9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines@9am

Top Headlines@9am

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్తారు.. అయితే, నిన్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై నేడు హైకమాండ్ పెద్దలతో సీఎం చర్చించబోతున్నారు. అలాగే ఈ 10 రోజుల ప్రభుత్వ పాలన ఎలా ఉందో పార్టీ అధిష్టానానికి ఆయన చెప్పనున్నారు. ఇక కీలకమైన మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల 24న లేదా 25న కేబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. దానిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఇతరులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపైనా కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే, ప్రధానంగా ఆరు మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక, ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి తిరిగి హైదరాబాద్ రాననున్నారు. ఒక్కరోజులోనే చర్చలన్నీ ముగియనున్నాయి. కాగా, ఈసారి గెలిచిన నేతలకే కాకుండా.. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తారని సమాచారం.. నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్, నిజామాబాద్ లో షబ్బీర్ అలీ లాంటి వారికి ప్రాధాన్యం ఉంటుందని టాక్. తద్వారా మైనార్టీలకు పార్టీ మరింత దగ్గరవుతుందనే అంచనాలో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. అయితే, ఆశావహులు మాత్రం ఎక్కువగానే ఉన్నారు.

కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు.. డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు
తెలంగాణలో ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న పేదల కల సాకారం కాబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబరు 28 నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు.దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలపై గ్రామసభలో తీర్మానం చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాలు.. పాల్గొననున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. సోమవారం సాయంత్రం 6.15 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ఈ నెల 23 వరకు ఆమె బస చేస్తారని రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం 5 గంటలకే హకీంపేట మిలటరీ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సినందున షెడ్యూల్ కాస్త ఆలస్యమైంది. నగరంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్‌ను కూడా బేగంపేటకు తరలించారు. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమై బేగంపేట నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. స్వాగతించిన వారితో కాసేపు మాట్లాడిన అనంతరం ద్రౌపది ముర్ము విమానాశ్రయం నుంచి కాన్వాయ్‌లో బయలుదేరి రాత్రి 8 గంటలకు బొల్లార్ చేరుకున్నారు. ఇవ్వాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బొల్లారం నుంచి బేగంపేట రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి..

ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస భేటీలు.. నేతల్లో టెన్షన్..
ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేతో ఆయన భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్ కు గురి అవుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేతో సీఎం జగన్ విడివిడిగా సమావేశం అవుతున్నారు. నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీ బలంపై జగన్ అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఆయా స్థానాలకు కొత్త ఇంఛార్జులను నియమించేందుకే వారితో భేటీ అవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అలాగే, విజయవాడ పైనా సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. మరోవైపు, పలువురు వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆందోళన కొనసాగుతుంది. తమ నియోజకవర్గాల్లో వేరే వాళ్లను ఎన్నికల బరిలోకి దింపబోతున్నారనే ప్రచారం సాగుతుండటంతో వాళ్లు టెన్షన్ పడుతున్నారు. తమకు ఎక్కడ ఎమ్మెల్యే సీటు రాకుండా పోతోందనని భయపడుతున్నారు. సీఎం జగన్‌ను కలిసి సీటుపై గ్యారంటీ తీసుకోవాలనే కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇంఛార్జులను సైతం ఆయన మార్చారు. మరికొంత మంది ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఏపీలో రేషన్ కార్డుదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు కందిపప్పును తరలించనుంది.. సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు 8 టన్నుల కందిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.. ఇప్పటికే ఈ కంది పంపిణీ హాట్ టాపిక్ గా మారింది.. జనవరి నుంచి అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. అటు తొలిసారిగా రాష్ట్రంలో పండిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేసి, సరఫరా చేయనుంది. డిసెంబర్‌ నెలలో 46.64 లక్షల మందికి సుమారు 4,604 టన్నుల కందిపప్పును కిలో రూ.67కే అందించింది.. అలాగే గిరిజన ప్రాంతాల్లో కంది సబ్సిడీ ద్వారా అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.. గత ఏడాదిగా మార్కెట్‌లో కందిపప్పు ధరలు పెరుగుతూ వచ్చాయి.

కళ్లముందే కొడుకు చేసిన పనికి షాక్ అవుతున్న సుమ..అయ్యో పాపం..
యాంకర్ సుమ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెర పై స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది.. ఆమె ఎన్నో షోస్‌ చేసింది. ఇప్పటికీ సినిమా ఈవెంట్లు చేస్తుంది. సుమ అడ్డా షోకి హోస్ట్ గా చేస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె తన కొడుకు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తుంది. ఆయన హీరోగా బబుల్‌ గమ్‌ అనే సినిమాలో నటించిన విషయాన్ని చెబుతుంది.. ఈ సినిమా ఈనెల 29 నా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సుమ ఈ షో లో తెలిపింది.. విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో బబుల్ గమ్ టీమ్ ఈ షోకు ప్రమోషన్స్ కోసం వచ్చారు.. రోషన్‌, హీరోయిన్‌ మానస చౌదరి, దర్శకుడు రవికాంత్‌ పేరపుతో పాటు ఆర్టిస్ట్ కిరణ్‌ మచ్చ, అలాగే రాజీవ్‌ కనకాల ఈ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా రాజీవ్‌ కనకాల, సుమ మధ్య ప్రేమ మళ్లీ చిగురించింది.. రాజీవ్ ఎర్రటి గులాబీలతో తనకు ప్రపోజ్ చేస్తాడు.. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య సాగిన సీన్స్ షోకు హైలెట్ అయ్యాయి..

బికినిలో యోగా చేసిన తేజు.. ఆ పోజుతో చెమటలు పట్టిస్తున్న బ్యూటీ..
బిగ్ బాస్ హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ అమ్మడు చాలా వరకు సోషల్‌ మీడియాతోనే సాహవాసం చేస్తుంది.. గ్లామర్ డోస్ పెంచుతూ,బోల్డ్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ఏ రేంజులో ఉంటాయో చెప్పనక్కర్లేదు.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.. తేజస్వి మదివాడ తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా బీచ్ వెకేషన్ కి వెళ్లిన తేజస్వి ఒక క్రేజీ ఫోటో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. బికీనీ ధరించిన ఆమె యోగా భంగిమలో పోజ్ ఇచ్చారు. తేజస్వి యోగ లుక్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ లైక్స్ షేర్స్ తో వైరల్ చేస్తున్నారు.. ఈ పోజులతో చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇకపోతే ఈ అమ్మడు కేరీర్ అంతగా ఆశాజనకంగా లేదని తెలుస్తుంది.. కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసి రాలేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు. అరుణ్ కుమార్ సిరీస్లో నటించగా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది..

నేడే ఐపీఎల్‌ మినీ వేలం.. అదృష్టం పరీక్షించుకోనున్న 333 మంది ఆటగాళ్లు! జాక్‌పాట్‌ ఎవరికో
ప్రతీ ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నీ కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. లీగ్‌ వేలంపై కూడా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఏ ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుంది, పాలనా ప్లేయర్ ఎన్ని కోట్లు కొల్లగొడుతాడు, అత్యధిక ధర ఎవరికి దక్కుతుంది, ఏ అనామక క్రికెటర్ జాక్‌పాట్‌ కొడతాడు అనే చర్చలు సాగుతూనే ఉంటాయి. ఇలాంటి ఆసక్తికర సన్నివేశాల కోసం మరోసారి ఐపీఎల్‌ 2024 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. 333 మంది క్రికెటర్లు నేడు జరిగే వేలంలో అందుబాటులో ఉన్నారు. ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ముందు మినీ వేలానికి రంగం సిద్ధమైంది. తొలిసారిగా భారత్‌ వెలుపల ఈ వేలాన్ని నిర్వహిస్తున్నారు. మినీ వేలం దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జరుగనుంది. 2025లో జరిగే మెగా వేలానికి ముందు ఇదే చివరి ఆక్షన్‌. ఈ వేలం స్టార్‌స్పోర్ట్స్‌, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మినీ వేలం కాబట్టి ఈ రోజే పూర్తవనుంది. ఐపీఎల్‌ 2024 వేలంలో మొత్తం 333 మంది ప్లేయర్స్ బరిలో ఉన్నారు. ఇందులో 214 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 119 మంది విదేశీయుల్లో ఇద్దరు అసోసియేట్‌ దేశాల నుంచి ఉన్నారు. 10 ప్రాంఛైజీలు కలిపి 77 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందులో 30 విదేశీ ఆటగాళ్ల కోటా స్థానాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్‌ మార్చి 22న ఆరంభమయ్యే అవకాశముంది.