*ఫ్యామిలీ డాక్టర్ దేశానికే రోల్ మోడల్
ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక విధానాన్ని ప్రారంభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. దేశంలో గొప్ప మార్పునకు లింగంగుంట్ల నుంచి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభోత్సవం కోసం గురువారం పల్నాడులో పర్యటించిన ఆయన.. లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీడాక్టర్ విధానం నేటి నుంచి ప్రారంభిస్తున్నాం. దేశచరిత్రలోనే వైద్యసేవల విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాం. ఈ కాన్సెప్ట్ దేశ చరిత్రలోనే రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఆదునిక వైద్యాన్ని ఉచితంగా మీ గడప వద్దకు తీసుకువచ్చే విధానమే ఫ్యామిలీ డాక్టర్ విధానమని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ చరిత్రలో ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదనే గొప్ప ఉద్దేశంతో రాష్ట్రంలో నేటి నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులోకి వచ్చిందన్నారు. ఇక పై డాక్టర్ కోసం ప్రజలు బయటకు వెళ్లాల్సిన పనిలేదని, ప్రతి పేదవాడి ఇంటి ముందుకు డాక్టరు,మందులు వస్తాయన్నారు. పెన్షన్లు మీ ఇంటికి నడిచి వచ్చినట్లుగా వైద్యం కూడా మీ ముంగిట్లో కి వస్తుందన్నారు సీఎం జగన్. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్‌ల లో 105 రకాల మందులు, 14 రకాల టెస్ట్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డాక్టర్ల సలహా తీసుకునే సదుపాయం ఉందన్నారు. వైద్య సిబ్బంది పోస్టింగ్ ఉన్న చోటే అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. పేదలకు వైద్య ,ఆరోగ్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన ఆదేశించారు.
*ఎస్సై దంపతుల ఆత్మహత్య.. కారణమేంటంటే?
అన్యోన్యమైన కుటుంబంలో కలతలు. చిన్న చిన్న గొడవలు అతి సాధారణం. కానీ అవే చిలికి చిలికి గాలివానై ఒకరినొకరు ప్రాణాలు తీసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అర్థం చేసుకునే రోజులుపోయి కాపురాల్లో కలతలు ఏర్పడి కాటికి వెళ్లే వెళ్లి పరిస్థితులు వస్తున్నాయి. చిన్న చిన్ని పాటి గొడవలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. కుటుంబ కలహాలతో భార్య భర్తల్లో ఒకరు చనిపోతే అది భరించని కొందరు తను లేని జీవితం ఎందుకని మరొకరు తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనే జగనామ జిల్లాలో చోటుచేసుకుంది. జనగామ జిల్లాలో శ్రీనివాస్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. భార్యతో జనగామలోనే ఉంటున్నారు శ్రీనివాస్. వీరిద్దరి 27 ఏళ్ల క్రితం పెళ్లి కాగా.. వీరికి ఇద్దరు కుమారులు రవితేజ, బబ్లు ఉన్నారు. అయితే పెద్దబ్బాయికి ఆరునెల క్రితమే వివాహమైంది. రోజూ లాగానే ఉదయం లేచి భార్యతో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరూ గొడవకు దిగారు. మాట మాట పెరగటంతో భరించని భార్య బయట బాత్‌రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన భర్యా ఎక్కడికి వెళ్లిందో అని శ్రీనివాస్ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే బయట బాత్‌రూం తలుపులు వేసి వుండటంతో తెరిచిచూడగా షాక్ కి గురయ్యాడు. తన జీవితంలోని సగభాగం చిన్న గొడవకు కలతచెంది తనను వదిలి వెళ్లిపోయిందని భావించి బోరున ఏడ్చాడు. పోలీసులకు సమాచారం అందించాడు. అయితే తన భార్య గురించి తనే కుటుంబ సభ్యులకు ఆవార్త కన్నీరు కారుస్తూ గుండెల పగేలా చెప్పుకున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ భార్య లేని జీవితం తనకు వద్దనుకున్నాడు. బాత్ రూంకి వెళ్లి వస్తానని తలుపులు వేసుకుని తన తుపాకీతో పాయింట్ బ్లాంక్ లో కాల్చుకున్నాడు. దీంతో పెద్ద శబ్దం రావడంతో పోలీసులు బాత్‌రూమ్ వద్దకు పరుగులు తీసారు. బాత్‌రూం తలుపులు బద్దల కొట్టి చూడగా ఎస్ఐ శ్రీనివాస్ విగతజీవిగా పడివున్నాడు. అయితే కుటుంబం కలహాల నేపథ్యంలోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
*లీకేజీతో ఈటలకు లింకులు.. నోటీసులు జారీచేసిన పోలీసులు
పదో తరగతి పేపర్ లీకేజ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. అది రానురాను బీజేపీ మెడలకు చుట్టుకుంటుంది. టెన్త్ పేపర్ లీకేజీకి ఎవరు పాల్పడ్డారో తెలుసుకుంటున్న పోలీసులకు నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ నాయకులే టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో భాగమవడంతో ఒక్కొక్కరిని అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నారు. అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కాగా.. ఇప్పుడు ఇందులో ఈటెల రాజేందర్ పేరు కూడా చేరడంతో ఈకేసు కీలకంగా మారింది. దీంతో ఇవాళ ఈటెల రాజేందర్ ను నోటీసులు జారీ చేశారు అధికారులు. 10 th క్లాస్ పేపర్ లీకేజ్ కేసులో హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు నోటీసులు ఇచ్చారు అధికారులు. కమలాపూర్ లో పేపర్ లీకేజ్ పై ఈటెల స్టేట్మెంట్ వరంగల్ పోలీసులు రికార్డ్ చేయనున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ప్రశాంత్ పేపర్ ను పంపించినట్లు పోలీసులు గుర్తించడంతో సంచలనంగా మారింది. 10 పేపర్ లీకేజ్ కు హుజురాబాద్ నియోజకవర్గంనే ఎందుకు ఎంచుకున్నారన్న దాని పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుజారాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. ఈ వ్యవహారంలో ఈటల రాజేందర్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని కూడా ఈటలకు పంపినట్లు ఆధారాలు ఉండడంతో పదో తరగతి పేపర్ లీక్ కేసులో పోలీసులు ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఈటల వాంగ్మూలాన్ని వరంగల్ పోలీసులు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈటెల రాజేందర్ తో పాటు , ఆయన పీఏలకు వరంగల్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. పోలీసుల నోటీసులకు ఈటల రాజేందర్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.
*దేశంలో 5 వేలను దాటిన రోజూవారీ కోవిడ్ కేసులు..
దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,335 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గత రోజుతో పోలిస్తే 20 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 25,587 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత సెప్టెంబర్ 23 తర్వాత తొలిసారిగా కేసుల సంఖ్య 5 వేలను దాటింది. ప్రస్తుతం రోజూవారీ పాజిటివిటీ రేటు 3.32 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు మొత్తం కేసుల సంఖ్యలో 0.06 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,826 రికవరీలు నమోదు అయ్యాయి. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి కోవిడ్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,82,538కి చేరుకుంది. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో కేంద్ర రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. ఐసీయూలు, ఆక్సిజన్ సరఫరా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఢిల్లీలో కొత్తగా 509 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 26.54 శాతానికి చేరుకుంది. ఇది దాదాపుగా 15 నెలల్లో అత్యధికం. ఇటీవల పెరుగున్న కేసులపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని ఏర్పాట్లను చేసినట్లు వెల్లడించారు.
*రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం
రేషన్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను విడుదల చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. రేషన్ కార్డ్ షాపుల్లో అక్రమాలను నివారించేందుకు కొత్త పరికరం ప్రవేశ పెట్టనుంది. దీని వల్ల రేషన్ కార్డ్ హోల్డర్లు పెద్ద ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. రేషన్ దుకాణాల వద్ద ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ పరికరాలను తప్పనిసరి చేశారు. రేషన్ కేంద్రాల్లో ఐపీఓఎస్(IPOS) యంత్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకు వీలు లేదని కేంద్రం సృష్టం చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం లబ్ధిదారులు పూర్తి స్థాయిలో ఆహార ధాన్యాలను పొందేందుకు వీలుగా రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ స్కేల్స్‌తో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈపీఓఎస్) పరికరాలను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చట్టం నిబంధనలను సవరించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం(NFSA) కింద టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (TPDS) పారదర్శకతను మెరుగుపరచడానికి అంటే ఆహార ధాన్యాల తూకాల్లో జరుగుతున్న మోసాలను నివారించేందుకు ఆ నిబంధన తెచ్చింది. NFSA కింద దేశంలోని దాదాపు 80 కోట్ల మందికి ఒక్కో వ్యక్తికి నెలకు ఐదు కిలోల గోధుమలు, బియ్యాన్ని వరుసగా కిలోకు రూ.2-3 చొప్పున సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తోంది. 2023లో కూడా ఉచిత రేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కోట్లాది మందికి ప్రభుత్వం నుంచి ఉచిత రేషన్ సౌకర్యం లభిస్తోంది. అదే సమయంలో, బిపిఎల్ కార్డు హోల్డర్లకు డిసెంబర్ 2023 వరకు ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది.
*ఫ్రెండ్ అని నమ్మితే.. పెళ్లికి పనికి రాకుండా చేశాడు
ప్రతి ఒక్కరి జీవితంలో ఓ బెస్ట్ ఫ్రెండ్ తప్పని సరిగా ఉంటారు. స్నేహం చాలా ముఖ్యం. సన్నిహిత మిత్రులతో ప్రతిదీ పంచుకుంటాము. అతడు కనిపించకుంటే చాలా బాధపడతాము. అలాంటి స్నేహితుడు మోసం చేస్తే అసలు తట్టుకోలేము. అలా చేస్తే స్నేహం పట్ల విశ్వాసం కచ్చితంగా పోతుంది. అటువంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని కేంద్రపాడ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన బెస్ట్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ ను కోసేశాడు. తర్వాత ఆ యువకుడు తన స్నేహితుడిని అక్కడే వదిలి పారిపోయాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొలిపింది. ఇది రాజ్‌నగర్‌లో జరిగింది. ఈ సంఘటన తర్వాత తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రిలో చేర్చారు. భగవత్ దాస్ అతని స్నేహితుడు అక్షయ్ ఆదివారం సెలవు రోజున పెంటా వద్ద బీచ్‌కి వాకింగ్ కి వెళ్లారు. ఇద్దరూ బీచ్‌లో చాలా సేపు గడిపారు. ఆ తర్వాత భోజనం చేసి అక్కడే పడుకున్నారు. భగవత్ నిద్రపోతున్నప్పుడు అక్షయ్ అతని ప్రైవేట్ భాగాన్ని పదునైన ఆయుధంతో కోశాడు. ఆ తర్వాత భగవత్ తీవ్ర గాయాల పాలయ్యాడు.. అనంతరం అక్షయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన భగవత్ తన బంధువులకు సమాచారం అందించాడు. అతని బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా భగవత్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని శరీరం నుంచి రక్తం కారుతోంది. అతడిని బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, భగవత్ మామ అక్షయ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్షయ్ కోసం వెతుకుతున్నారు. అయితే అక్షయ్ ఎందుకు ఇలా చేశాడో ఇంకా అర్థం కాలేదు.
*అరెస్ట్ తర్వాత అమాంతం పెరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ..
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ కేసులో డొనాల్డ్ ట్రంప్ న్యాయపరమైన విచారణ ఎదుర్కొంటున్నారు. 2016 ఎన్నికల ముందు స్టార్మీ డేనియల్ తో ఉన్న శృంగార సంబంధాన్ని దాచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుల నేపథ్యంలో ఆయన న్యూయార్క్ మాన్ హట్టన్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. మొత్తం 34 అభియోగాలను ఎదుర్కొంటున్నారు ట్రంప్. ఇదిలా ఉంటే ట్రంప్ అరెస్ట్ తరువాత అమెరికాలో ఆయనకు విపరీతమైన పాపులారిటీ ఏర్పడింది. అమాంతం ఆయనకు ప్రజాదరణ పెరిగింది. ఇలా తనకు ఆదరణ పెరగడాన్ని ‘‘చరిత్రలో అత్యుత్తమ రోజు’’ ట్రంప్ అభివర్ణించారు. డొనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీలో మద్దతు కూడా పెరిగింది. తాను వామపక్ష డెమోక్రాట్ కుట్రకు బాధితుడిగా ట్రంప్ చూపించుకోవడంతో అమెరికా వ్యాప్తంగా ప్రజాదరణ సొంతం చేసుకుంటున్నారు. తనను అన్యాయమైన నేరారోపణలో ఇరికించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. 76 ఏళ్ల ట్రంప్ అమెరికా చరిత్రలోనే నేరారోపణలతో విచారణకు గురైన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు. ఆయనకు అమెరికా వ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం కోసం ఏకంగా 10 మిలియన్ డాలర్లు విరాళంగా వచ్చాయి. మాన్ హాటన్ డిస్ట్రిక్ కోర్టు అటార్నీ ఆల్విన్ బ్రాగ్ రాజకీయ కారణాలతోనే ఇలా చేశారని ట్రంప్ ఆరోపించారు. తాజాగా యాహూ న్యూస్ నిర్వహించిన పోల్ లో చాలా మంది రిపబ్లికన్ ఓటర్లు ఇప్పటికీ ట్రంప్ నే తన అభ్యర్థిగా చూస్తున్నారు.
*కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ఏబీడీ
రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం గత ఫామ్ ను అందుకుని మెరుపులు మెరిపిస్తున్నాడు. అయితే ఏడాది క్రితం వరకు మాత్రం పరిస్థితి ఇలా ఉండేది కాదు.. 2019 తర్వాత ఫామ్ కోల్పోయి సుమారు మూడేండ్ల పాటు తన కెరీర్ లోనే అత్యంత గడ్డు కాలం గడిపిన సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గతేడాది ఆగస్టు నుంచి మళ్లీ మునపటి ఫామ్ ను అందుకుని వీరవిహారం చేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ తన అత్యుతమ ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా కోహ్లీ ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నాడని.. అతడి మోహంపై నిత్యం నవ్వు కనిపిస్తుందని ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్నాడు. కెప్టెన్సీ నుంచి విముక్తి పొందడం వల్లే విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నాడని.. అతని మోహంపై చిరు నవ్వు కనిపిస్తుందని అభిమానులు ముద్దుగా పిలుచుకునే మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అన్నాడు. ప్రస్తుతం విరాట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇటీవల తనను కలిసిన విలేకరులతో డివిలయర్స్ కోహ్లీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే చాలా కాలంగా కోహ్లీని చూస్తున్న మీకు.. అతడిలో ఏమైనా మార్పు కనిపించిందా.. అని విలేకరులు అడిగిన ప్రశ్నకు డివిలియర్స్ సమాధానమిస్తూ ఎలాంటి మార్పు లేదని చెప్పుకొచ్చాడు. టెక్నిక్ అలాగే బలంగా ఉంది. క్రీజులో చక్కగా కదులుతున్నాడు. ఇప్పటికీ అతడు బిజీ ప్లేయరే.. ఇటీవల కోహ్లీ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో చూస్తూ అతడు చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు.. ఎప్పుడు నవ్వుతూ ఉంటున్నాడు. కెప్టెన్సీ వదిలేయడం వల్లే కోహ్లీ సంతోషంగా ఉన్నాడని డివిలియర్స్ అన్నారు.
*ఏప్రిల్ 10న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థం ?
అపరిమిత అందంతో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు పరిణీతి చోప్రా. పన్నెండేండ్ల కెరీర్‌లో పలు హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. త్వరలోనే పరిణీతి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చందా, నటి పరిణీతి చోప్రాలు ప్రేమలో వున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిరు కలిసి ముంబయిలో చాలా ఈవెంట్స్‌కు హాజరయ్యారు. అయితే తన ప్రేమ వ్యవహారం గురించి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు పరిణీతి. వారు మార్చి 22న డిన్నర్ డేట్‌కి బయటకు వెళ్లి, మరుసటి రోజు లంచ్ కోసం మళ్లీ కలుసుకున్నారు. ఇద్దరూ ఇదే విషయంపై పెదవి విప్పినప్పటికీ.. పరిణీతి, రాఘవ్ త్వరలో తమ ఎంగేజ్ మెంట్ జరుపుకోనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. రాఘవ్, పరిణీతి ఇద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలిసి చదువుకున్నారు. వీరికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో ఈ జంటకు నిశ్చితార్థం జరగనున్నట్లు తెలిసింది. ఢిల్లీలో ఎంగేజ్‌మెంట్ కోసం ఏర్పాటు జరుగుతున్నాయని చెబుతున్నారు. నిశ్చితార్థం కోసం పరిణీతి చోప్రా షూటింగ్స్‌ను వాయిదా వేసుసుంది. ప్రస్తుతం ఈ భామ హిందీలో ఛమ్కీలా, క్యాప్య్సుల్ గిల్ చిత్రాల్లో నటిస్తున్నది. ముంబై, న్యూఢిల్లీ విమానాశ్రయాలలో ఇద్దరూ తరచుగా కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దర్శకుడు మనీష్ శర్మతో పరిణీతి డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోయి దాదాపు ఏడాది కావస్తోంది.
