NTV పాడ్ కాస్ట్ షోలో భాగంగా తాజాగా ‘గీతా’ గాన గంధర్వ డాII ఎల్. వి. గంగాధర శాస్త్రితో ప్రత్యేకంగా ముచ్చటించింది. గంగాధర శాస్త్రి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అవనిగడ్డ. భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఘంటసాల ఆలపించిన 108 శ్లోకాలు గంగాధర శాస్త్రి పాడడంతో పాటు, మిగిలిన శ్లోకాలు స్వీయ సంగీతంలో ఆలపించి రికార్డు చేశారు. అలా భగవద్గీత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం 2017 లో ‘కళారత్న’ అవార్డుతో సత్కరించింది. మధ్యప్రదేశ్‌లోని మహర్షి పాణిని యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అలాగే 2023కి గాను ఎల్.వి.గంగాధర శాస్త్రి ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ పురస్కారం కూడా వరించింది. ఆయన ఎన్నో విషయాలు ఈ షోలో పంచుకున్నారు. మీరు కూడా వినేయండి.
Podcast With NTV: ‘గీతా’ గాన గంధర్వ డాII ఎల్. వి. గంగాధర శాస్త్రితో

Lv Gangadhara Shastry