NTV Telugu Site icon

NTR : వైరల్ అవుతున్న ఎన్టీఆర్ చిన్నప్పటి వీడియో.. ఎంత క్యూట్ గా వున్నాడో..

Ntr (3)

Ntr (3)

NTR : నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.చిన్న వయసులోనే ఊహించని స్థాయిలో మాస్ ఇమేజ్ అందుకొని ఎన్నో రికార్డ్స్ తిరగరాశారు .తన నటనతో ,డాన్స్ తో ఎన్టీఆర్ ఎంతగానో మెప్పిస్తూ వస్తున్నారు.యాక్టర్ గా ,డాన్సర్ గా ,సింగర్ గా మల్టీ టాలెంట్ తో ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు.పేజీలకు పేజీలు డైలాగ్స్ కూడా సింగల్ టేక్ లో చెప్పగల నటనాచాతుర్యం ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం.అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ గ్లోబల్ స్థాయికి చేరింది.ఆ సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

Read Also :Indian 2 : శంకర్ ‘ఇండియన్ 2’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నారు.దేవర సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి ,కొడుకుగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ చిన్నప్పటి వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ చిన్నప్పుడు యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.ఆ ఈవెంట్లో సీనియర్ నటి శారద పక్కన ఎన్టీఆర్ కూర్చొని మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో ఎన్టీఆర్ నిక్కర్ వేసుకొని కనిపించాడు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Show comments