Site icon NTV Telugu

Janvi Kapoor : ఐఫాలో జాన్వీ పాప వేసుకున్న నెక్లెస్ ఎన్ని కోట్లో తెలుసా ?

New Project (28)

New Project (28)

Janvi Kapoor : అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్‌ఏ) అవార్డుల ప్రదానోత్సవానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. సెప్టెంబర్ 27న ప్రారంభమైన అవార్డుల వేడుక ఆదివారంతో ముగిసింది. దాదాపు రెండు రోజుల పాటు అవార్డుల వేడుక కన్నుల పండువగా సాగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ… దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకకు జాన్వీ కపూర్ కూడా హాజరయ్యారు. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్ కోసం గోల్డెన్ గౌరవ్ గుప్తా గౌన్ ధరించింది ముద్దుగుమ్మ. బల్గారీ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ ఆభరణాలను ఎంచుకుంది. ఆమె స్పెషల్ డ్రెస్ తో అందరి చూపు ఆమె వైపు మళ్లింది. ఈ ఈవెంట్‌లో ఆమె ధరించిన నెక్లెస్ ధర సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆ నెక్లెస్ ధర ఎంతో తెలుసుకుందాం.

Read Also:TG High Court: నేడు హైకోర్టు ముందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్..

అవార్డుల వేడుకలో జాన్వీ పాప గోల్డ్ కలర్ డ్రెస్‌లో ఔరా అనిపించింది. సింపుల్ మేకప్ తో చాలా క్యూట్ గా ఎట్రాక్ట్ చేసింది. డ్రెస్ కు తగ్గట్టుగా సింపుల్ మేకప్ తో ఆకట్టుకుంది. ఆమె వేసుకున్న డ్రస్ కంటే కూడా అందరి చూపు ఆమె ధరించిన నెక్లెస్ పైనే పడింది. అందుకే ఆ నెక్లెస్ ధర ఎంత అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. దీని ధర రూ. 8 కోట్లు. జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఈ నెక్లెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సింపుల్‌గా ఉన్నా.. చాలా కాస్ట్లీ కావడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.. అసలే ఇది డైమండ్ నెక్లెస్.. అందుకే ఇంత ఖరీదు. ఆ నెక్లెస్ ఆమె దుస్తులకు, రూపానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవర బ్యూటీ అందరి చూపు తిప్పుకునేలా చేసింది..బాలీవుడ్ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న జాన్వీ ఇప్పుడు దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

Read Also:Olympic Games Athletes: అంబానీ ఇంట ప్యారిస్ ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ అథ్లెట్లకు విందు.!

Exit mobile version