NTV Telugu Site icon

NTR30: ఎన్టీఆర్ 30 షూటింగ్ అప్డేట్..

Ntr

Ntr

NTR30:ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ మరియు యువసుధ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గతేడాది ఎప్పుడో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాకు ముహూర్తం కుదిరింది. మార్చి 23 న ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నదని తెలుస్తోంది. ఇక మార్చి 29 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.

Pawan Kalyan: జనసేన దిగ్విజయ భేరి.. మేము సైతం అంటున్న డైరెక్టర్స్

కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబో లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కాంబో ఇప్పుడు ఎన్టీఆర్ 30 కు రిపీట్ అవుతుండడంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోవడంతో ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగింది.నెక్స్ట్ సినిమాపై మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక మరోపక్క కొరటాల ను ఆచార్య ప్లాప్ వెంటాడుతూనే ఉంది. కెరీర్ లోనే పరాజయం చూడని డైరెక్టర్.. ఆచార్యతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఆ ప్లాప్ ఎఫెక్ట్ ఎన్టీఆర్ సినిమా మీద పడకుండా కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని టాక్. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Show comments