NTR RS 100 Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల.. ఢిల్లీ వెళ్లలేకపోయిన జూనియర్ ఎన్టీఆర్!

Ntr Rs 100 Coin

Ntr Rs 100 Coin

NTR 100 Coin launched by the President of India: టీడీపీ పార్టీ అధినేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నాణేన్ని విడుదల చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు నందమూరి కుటుంబసభ్యులు నాణెం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దాదాపు 200 మంది అతిథులు పాల్గొననున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. ఈ వేడుకలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకాలేకపోయారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నాణెం విడుదల కార్యక్రమానికి ఎన్టీఆర్‌కి ఆహ్వానం అందినా.. ‘దేవర’ సినిమా షూటింగ్ కారణంగా ఆయన ఢిల్లీ వెళ్లలేకపోయారు.

×
×
Ad

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా సినిమా దేవర. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక కాగా.. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.