NTR : సినిమా నటీనటలు జనాల్లోకి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినోళ్లు కూడా రోడ్డు మీద ఓపెన్ గా తిరుగలేని పరిస్థితి. వాళ్లు ఎదురు పడితే చాలు సెల్ఫీలు అంటూ వెంటబడుతుంటారు. ఇక స్టార్ హీరోలు వస్తున్నారంటే వందల వేల మంది జనాలు గుమికూడతారు. అందుకే ఇండస్ట్రీకి చెందిన వారు సాధారణంగా బయటకు వెళ్లాలని అనుకోరు.. ఒక వేళ వెళ్లినా కూడా మాస్క్ పెట్టుకుని.. ఎవరూ గుర్తు పట్టని విధంగా బయట తిరుగుతుంటారు. కొందరు రాత్రి సమయంలో తిరగడం చూస్తూనే ఉంటాం. అయితే ఎన్టీఆర్ తాజాగా వందలాది మంది జనాలు తిరుగుతున్న రోడ్డు మీద కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్ రోడ్డు మీద తిరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినీ ప్రముఖులు రోడ్ల మీద తిరుగుతున్నారంటే అది కచ్చితంగా విదేశాల్లో అయ్యి ఉంటుంది. ఎన్టీఆర్ సైతం విదేశాల్లో రోడ్డు మీద తిరుగుతున్న సమయంలోనే ఈ వీడియోను ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే స్కాట్లాండ్‌కు చెందిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్ తీసిన వీడియోలో ఎన్టీఆర్ కనిపించాడు. అతడు తెలియకుండా తీసిన ఆ వీడియోలో ఎన్టీఆర్ కనిపించడంతో చాలా మంది తనకు మెసేజ్ చేశారట. ఆర్ఆర్‌ఆర్ సినిమాలో నటించిన హీరో అతడంటూ ఎన్టీఆర్ ను గుర్తించారట.
Read Also:UP: ఓ షాపింగ్ మాల్‌లో కోతి హల్‌చల్.. కస్టమర్లకు చుక్కలు చూపించిన మంకీ
స్కాట్లాండ్‌లోని ఫేమస్ ఎడిన్‌బర్గ్ క్రిస్మస్ మార్కెట్ అందాలను చిత్రీకరిస్తున్న సమయంలో సామాన్యులతో కలిసి ఓ సింపుల్ మ్యాన్ లా ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అంత మంది జనాల్లో సింపుల్‌గా అలా నడుస్తుండడం మనం ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ విదేశాల్లో అంత మంది జనం మధ్యలో అలా ఎన్టీఆర్ నడుచుకుంటూ వస్తున్న వీడియో అందరిని ఆకర్షిస్తుంది. ఎన్టీఆర్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్‌ఆర్, అరవింద సమేత, దేవర సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్‌ను దాటి గుర్తింపు ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ నెల చివరి వారం నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను కర్ణాటకలో మొదల కాబోతుంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
Read Also:HMPV Case : మరో హెచ్‌ఎంపీవీ కేసు.. 10 నెలల చిన్నారిలో బయటపడ్డ వైరస్!