ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్లెక్సీలో ఫోటోలు కలకలం లేపాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధిర నియోజకవర్గంలోని ఖానాపురం గ్రామంలో జరిగిన ఒక సమావేశంలో ఫ్లెక్సీ చర్చనీయాసంగా మారింది. ముదిగొండ మండలం ఖానాపురం గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా టీఆర్ఎస్ నాయకులు అందరూ హాజరయ్యారు .ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి.
అయితే అందులో ఒక ఫ్లెక్సీలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒకవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు ఉన్న ఫోటోలను ఏర్పాటు చేశారు మహాత్ముడు కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికై నాడు ఎన్టీఆర్ నేడు కేసీఆర్ తెలుగోడి ఆత్మగౌరవం నిలుపు దేశ్ కి నేత కేసిఆర్ అంటూ టీఆర్ఎస్ గ్రామ శాఖ ఖానాపురం ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ చర్చనీయాశంగా మారింది.