Site icon NTV Telugu

NTPC : ఏన్టీపీసీతో తెలంగాణలో భారీ సౌర పెట్టుబడి..!

Ntpc

Ntpc

NTPC : తెలంగాణకు ఇది ఒక శుభసంకేతంగా చెప్పుకోవాలి. పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా నిలిచిన జాతీయ సంస్థ ఎన్టీపీసీ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమై తమ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఎన్టీపీసీ ప్రతినిధులు రాష్ట్రంలో సౌర, గాలి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై సుమారు రూ. 80,000 కోట్ల పెట్టుబడులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా, నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో సుమారు 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని వివరించారు.

Road Accident: రాఖీ పౌర్ణమి రోజు విషాదం.. చెల్లి వద్దకు రాఖీ కోసం వెళ్తూ అనంత లోకాలకు..

ఈ ప్రాజెక్టులు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, భూమి వినియోగం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం, అలాగే ఉపాధి అవకాశాలు సృష్టించడం వంటి అనేక ప్రయోజనాలను రాష్ట్రానికి అందిస్తాయని ఎన్టీపీసీ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలోని పెద్ద రిజర్వాయర్లు, జలాశయాలు ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులకు అత్యుత్తమ వనరులుగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు విద్యుత్ అవసరాలను థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడ్డ తెలంగాణకు, ఈ పునరుత్పాదక ఇంధన పెట్టుబడులు కొత్త దిశానిర్దేశం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

CPI Ramakrishna: ఈసీ, బీజేపీపై రామకృష్ణ ఫైర్‌.. మోడీ, అమిత్ షా మొత్తం దొంగ ఓట్లు వేయిస్తున్నారు..!

Exit mobile version