Site icon NTV Telugu

NTPC Jobs 2024: ఎన్‌టీపీసీలో జాబ్స్ .. నెలకు జీతం 83 వేలు.. ఎలా అప్లై చెయ్యాలంటే ?

Ntpcc

Ntpcc

ఇంజనీరింగ్ చదివారా ?అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇప్పటికే పలు సంస్థల్లో పలు శాఖల్లో ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉండే ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం .. మొత్తం 63 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్‌ 13 దరఖాస్తులకు చివరితేది.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ https://ntpcrel.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.. ఒకసారి అర్హతలు ,ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు .. 63

ఇంజినీర్‌ (ఆర్ఈ-సివిల్‌) పోస్టులు: 20
ఇంజినీర్‌ (ఆర్‌ఈ-ఎలక్ట్రానికల్‌) పోస్టులు: 29
ఇంజినీర్‌ (ఆర్‌ఈ-మెకానికల్‌) పోస్టులు: 09
ఎగ్జిక్యూటివ్‌ (ఆర్ఈ-హెచ్‌ఆర్‌) పోస్టులు: 01
ఇంజినీర్‌ (ఆర్‌ఈ-సీడిఎం) పోస్టులు: 01
ఎగ్జిక్యూటివ్‌ (ఆర్ఈ-పైనాన్స్‌) పోస్టులు: 01
ఇంజినీర్‌ (ఆర్ఈ-ఐటీ) పోస్టులు: 01
ఎగ్జిక్యూటివ్‌ (ఆర్‌ఈ-కార్పొరేట్‌ కమ్యూనికేషన్) పోస్టులు : 01

అర్హతలు ..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్‌, పీజీ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి..
అభ్యర్థులకు 30 ఏళ్లు మించరాదు.

జీతం..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం విషయానికొస్తే.. నెలకు రూ.83,000గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు..
రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 21, 2024
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 13, 2024

అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోవడం మంచిది..

Exit mobile version