NTA లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్టీఏలో చాలా పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు అధికారిక సైట్ recruitment.nta.nic.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన వాళ్లు ఆగస్టు 31 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.. అంతే కాకుండా.. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన దశల ద్వారా కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో డైరెక్టర్ (గ్రూప్ ఎ), జాయింట్ డైరెక్టర్ (గ్రూప్ ఎ), రీసెర్చ్ సైంటిస్ట్ (గ్రూప్ ఎ) మరియు ఇతర పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను డిప్యూటేషన్ విధానంలో భర్తీ చేస్తారు.. ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు..
డైరెక్టర్ (గ్రూప్ ఎ) – 04
జాయింట్ డైరెక్టర్ – 02
రీసెర్చ్ సైంటిస్ట్ సీ – 01
సీనియర్ ప్రోగ్రామర్ – 02
డిప్యూటీ డైరెక్టర్ – 02
రీసెర్చ్ సైంటిస్ట్ బీ – 01
ప్రోగ్రామర్ – 03
అసిస్టెంట్ డైరెక్టర్ – 04
రీసెర్చ్ అసిస్టెంట్ – 02
సీనియర్ సూపరింటెండెండ్ – 02
స్టెనోగ్రాఫర్ – 03
వయస్సు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవారు..వయస్సు 56 ఏళ్లలోపు ఉండాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సహాయం తీసుకోవచ్చు.
అర్హతలు..
అభ్యర్థుల యొక్క విద్యార్హత పోస్టును బట్టి.. ఒక్కో విధంగా ఉంటుంది. డిగ్రీ , పీజీ, పీహెచ్ డీ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా.. పని అనుభవం సంబంధిత రంగంలో ఉండాలి..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ recruitment.nta.nic.in ని సందర్శించండి..తర్వాత అభ్యర్థి హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి
ఆ తర్వాత అభ్యర్థులు తమ ఈ మెయిల్ ఐడీని ఉపయోగించి రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వండి
ఆ తర్వాత అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి..
తర్వాత అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
ఆపై దరఖాస్తు ఇప్పుడు అభ్యర్థులు సమర్పించుపై క్లిక్ చేయండి.
ఆ తర్వాత అభ్యర్థి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసకోవచ్చు..
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్లు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోవచ్చు..