NTV Telugu Site icon

Noyal : బాలయ్య పై నోయల్ ర్యాప్ సాంగ్ అదిరిపోయిందిగా..

Whatsapp Image 2023 06 11 At 8.43.09 Am

Whatsapp Image 2023 06 11 At 8.43.09 Am

ఎన్టీఆర్ గారీ నట వారసుడిగా సినీపరిశ్రమలో కి హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బాలకృష్ణ. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరో స్థాయికి వెళ్లి అందరి ప్రశంసలు పొందాడు నందమూరి బాలకృష్ణ
ఆయన కెరీర్‏లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అలాగే ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాలు కూడా ఉన్నాయి. 1984లో డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు సినిమాతో హీరోగా ఆయన కెరీర్ కు టర్న్ ఇచ్చింది. ఈ తర్వాత ఆయన నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్ ను సాధించాయి.. మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నందమూరి నటసింహం బాలకృష్ణ మారారు.. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు అలాగే అభిమానులు బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షల ను తెలుపుతున్నారు.

బాలయ్య బర్త్ డే సందర్భంగా . ఆయన గొప్ప మనసును చాటుతూ సింగర్ నోయల్ సేన్ ఓ ర్యాప్ సాంగ్ ను కంపోజ్ చేసాడు.. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ పాటను యూట్యూబ్ ఛానల్లో కూడ విడుదల చేశారు. నోయల్ స్వయం గా రాసి ఆలపించిన ఈ పాట కు ప్రదీప్ సాగర్ స్వరాలు సమకూర్చాడని తెలుస్తుంది.. “నందమూరి సింహం వచ్చే సూడు.. “అంటూ సాగే ఈ పాట అందరిని బాగా ఆకట్టుకుంటుంటుంది. తాజాగా ఈ పాట విన్న అభిమానులు కూడా జై బాలయ్య అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ పై అంచనాలు కూడా బాగా పెరిగాయి.. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది..

 

Show comments