Site icon NTV Telugu

Novak Djokovic Cricket: క్రికెట్‌ ఆడిన టెన్నిస్‌ స్టార్ జకోవిచ్‌.. నవ్వులు పూయిస్తున్న వీడియో!

Novak Djokovic Played Cricket

Novak Djokovic Played Cricket

Novak Djokovic Played Cricket With Steve Smith: ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2024కు ముందు టెన్నిస్ లెజెండ్, సెర్బియన్‌ స్టార్‌ నొవాక్ జకోవిచ్ క్రికెట్ ఆడాడు. మెల్‌బోర్న్‌లోని రాడ్ లావర్ ఎరీనాలో గురువారం ఆస్ట్రేలియన్‌ స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌, దివంగత స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ తనయుడు జాక్సన్‌ వార్న్‌లతో కలిసి టెన్నిస్‌ కోర్టులోనే సరదాగా క్రికెట్ ఆడాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఛారిటీ టెన్నిస్‌ మ్యాచ్‌ సందర్భంగా జకోవిచ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేశాడు. ఛారిటీ టెన్నిస్‌ మ్యాచ్‌ సందర్భంగా స్మిత్‌, జాక్సన్‌ సైతం జకోతో టెన్నిస్‌ ఆడాడు.

టెన్నిస్‌ కోర్టులోనే జాక్సన్‌ వార్న్‌ బౌలింగ్ చేయగా నొవాక్ జకోవిచ్ షాట్ ఆడడంలో విఫలమయ్యాడు. దాంతో జకో నిరాశచెండాడు. అయితే ఆ తర్వాత బంతిని టెన్నిస్ బ్యాట్‌తో ఆడి స్టాండ్‌లోకి పంపాడు. దాంతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. ఆపై స్టీవ్‌ స్మిత్‌తో సెర్బియన్‌ స్టార్‌ టెన్నిస్ ఆడాడు. స్మిత్‌ ఆటకు జకో ఫిదా అయ్యాడు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా జకో టెన్నిస్ బ్యాట్‌తో బంతిని స్టాండ్‌లోకి పంపడాన్ని ఫాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read: Rohit Sharma: ఫ్రస్టేషన్‌లోనే శుభ్‌మన్ గిల్‌ను తిట్టా: రోహిత్

‘ఎ నైట్‌ విత్‌ నొవాక్‌ అండ్‌ ఫ్రెండ్స్‌’పేరిట జరిగిన ఈ ఛారిటీ మ్యాచ్‌లో నొవాక్ జకోవిచ్.. స్టెఫనాస్‌ సిట్సిపాస్‌తో తలపడ్డాడు. మధ్యలో జకో మహిళల డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సబలెంకతో జతకట్టగా.. సిట్సిపాస్‌ మరియా సక్కారితో కలిసి ఆడాడు. పోల్‌ వాల్ట్‌ ఛాంపియన్‌ జార్జియా గాడ్విన్‌తో కలిసి ఫీట్‌లు కూడా చేశాడు. బాస్కెట్‌బాల్‌, మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నింగ్‌, స్లామ్‌ డంక్‌ క్రీడలను కూడా ఆడాడు. సరదాసరదాగా సాగిన ఈ ఛారిటీ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోలు నవ్వులు పూయిస్తున్నాయి. ఇక 24 మేజర్‌ టైటిల్స్ గెలుచుకున్న జొకోవిచ్ రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశాడు. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. జనవరి 14న ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 ఆరంభం కానుంది.

Exit mobile version