Australian Open 2025: చరిత్ర సృష్టించే దిశగా జకోవిచ్.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పటికీ..!
- ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ జోరు
- అల్కరాస్, సబలెంక ముందంజ
- గాయంతో ఒసాక ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
25వ టైటిల్‌తో చరిత్ర సృష్టించే దిశగా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ (సెర్బియా) సాగిపోతున్నాడు. గతేడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ కూడా గెలవని జకో.. తన అడ్డా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జోరు సాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో జకోవిచ్ 6-1, 6-4, 6-4తో మచాక్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో సెట్ కోల్పోయిన జకో.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో సెట్ ఆరంభంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పటికీ.. కోర్టులోనే చికిత్స తీసుకుని సునాయాస విజయం సాదించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.
రెండో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6-3, 6-4, 6-4తో జేకబ్ (బ్రిటన్)పై గెలవగా.. మూడో సీడ్ అల్కరాస్ (స్పెయిన్) 6-2, 6-4, 6-7 (3-7), 6-2తో బోర్గెస్ (పోర్చుగల్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో బెలారస్ భామ సబలెంక సత్తాచాటుతోంది. మూడో రౌండ్లో 7-6 (7-5), 6-4తో టాసన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6-4, 6-2తో ఫెర్నాండెజ్ (కెనడా)పై గెలుపొందింది. ఏడో సీడ్ పెగులా (అమెరికా) 7-6 (7-3), 6-1తో డానిలోవిచ్ (సెర్బియా)పై ఓడిపోయింది. ఇక మాజీ ఛాంపియన్ ఒసాక (జపాన్) ఉదర కండరం నొప్పితో బెన్సిచ్ (స్విట్జర్లాండ్)తో మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న, షూయి జంగ్ జోడి 6-4, 6-4తో డోడిగ్ (క్రొయేషియా)- క్రిస్టీనా (ఫ్రాన్స్)పై నెగ్గింది.
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
తాజావార్తలు
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!