Site icon NTV Telugu

IB Executive Recruitment 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 జాబ్స్.. ఈ అర్హతలుంటే అస్సలు వదలొద్దు

Ib

Ib

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్. వందలు కాదు.. ఏకంగా వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకాబోతున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 3,717 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. వయోపరిమితి ఆగస్టు 10, 2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాలు కలిగి ఉండాలి.

Also Read:Exclusive : హరిహర వీరమల్లు పార్ట్-2 షూటింగ్ ఎంతవరకు వచ్చిందంటే

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ కేటగిరీలకు చెందిన దరఖాస్తుదారులు రూ. 650 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ కేటగిరీల అభ్యర్థులు రూ. 550 చెల్లించాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 19న ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 10 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version