Nothing Earbuds Launch and Price: వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై స్థాపించిన ‘నథింగ్’ నుంచి రెండు కొత్త ఇయర్‌బడ్స్ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ ఏ పేరిట కంపెనీ వీటిని ఆవిష్కరించింది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే ఈ ఇయర్‌బడ్స్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌తో నథింగ్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 22 నుంచి విక్రయాలు ఆరంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి నథింగ్ ఇయర్‌ను రూ.10,999, ఇయర్ ఏను రూ.5,999కే పొందవచ్చు. నథింగ్ నుంచి వచ్చిన ఈ రెండు ఇయర్‌బడ్స్‌కు సంబందించిన వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
నథింగ్ ఇయర్ ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ఇవి బ్లాక్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో 11mm డ్రైవర్స్ అమర్చారు. 45 డీబీ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సిలింగ్ సదుపాయం ఉంది. ఇందులో కేస్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 40.5 గంటల ప్లే బ్యాక్ టైమ్ ఇస్తాయి. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటలు వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది. 2.5W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయడంతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉందని కంపెనీ తెలిపింది. దీన్ని 90 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు.
Also Read: T20 World Cup 2024: భారత్ భయం లేకుండా ఆడాలి.. ఓపెనర్లుగా వారిద్దరే కరెక్ట్: దాదా
నథింగ్ ఇయర్ ఏ ధర రూ.7,999గా ఉంది. ఇవి ఎల్లో, బ్లాక్, వైట్ రంగుల్లో లభ్యమవుతాయి. 45 డీబీ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఇందులో ఉంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉంటుంది. క్యారీ కేస్ 500mAh బ్యాటరీ, ఇయర్‌బడ్స్‌లో 46mAh యూనిట్ ఇచ్చారు. ఈ ఇయర్‌బడ్స్‌ను ఒకసారి ఫుల్ ఛార్జి చేస్తే 42.5 గంటల ప్లే బ్యాక్ టైమ్ ఇస్తాయి. 10 నిమిషాల ఛార్జింగ్‌తో పది గంటలు పని చేస్తాయి.