Rahul Gandhi: రాజస్థాన్‌లో గౌతమ్ అదానీ రూ. 60వేల కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదానీ పెట్టుబడులు పెడతానని హామీ ఇచ్చిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, తాను కార్పొరేట్లకు వ్యతిరేకం కాదని, గుత్తాధిపత్యానికి వ్యతిరేకమని అన్నారు. ఒకవేళ అదానీకి రాజస్థాన్ ప్రభుత్వం తప్పుడు పద్ధతిలో వ్యాపారాన్ని అప్పగిస్తే.. దానిని కూడా వ్యతిరేకిస్తానని ఆయన అన్నారు. వ్యాపారవేత్త 60 వేల కోట్లు పెట్టుబడి పెడుతానంటే ఏ ముఖ్యమంత్రి కూడా దాన్ని తిరస్కరించరని రాహుల్ అన్నారు.
Mallikarjuna Kharge: విహెచ్, ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ.. మైక్ లేకుండానే మాట్లాడు అంటూ సెటైర్లు
కొందరు బడా వ్యాపారులకు సాయం చేయడానికి రాజకీయ అధికారాన్ని వినియోగించడాన్ని తాను వ్యతిరేకిస్తానన్నారు. దేశంలోని వ్యాపారాలన్ని రెండు, మూడు బడా కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తామని రాహుల్‌గాంధీ అన్నారు. గౌతమ్ అదానీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ కేవలం బడా వ్యాపారవేత్తలకు మాత్రమే సాయం చేస్తున్నారని రాహుల్‌గాంధీ తరచూ ఆరోపిస్తున్న నేపథ్యంలో బీజేపీ శుక్రవారం కాంగ్రెస్‌ను ఎగతాళి చేసింది. అదానీతో గెహ్లాట్ భేటీపై మీడియాలో చాలా ప్రచారం జరుగుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.
