NTV Telugu Site icon

Nora Fatehi : ముంబై మెట్రోలో డ్యాన్స్ చేసిన హీరోయిన్..వీడియో వైరల్..

Nora Fathehi

Nora Fathehi

బాలీవుడ్ బ్యూటి నోరా పతేహి గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఈ అమ్మడు తాజాగా మడ్‌గావ్‌ ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో నటిస్తుంది..త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. ఈ క్రమంలో మెట్రోలో డ్యాన్స్ చేసింది. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇక మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్’ యొక్క ట్రైలర్ నిజానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.. తాజాగా ఈ జోరును కొనసాగిస్తూ, మేకర్స్ ఈ సంవత్సరం యొక్క చక్కని పార్టీ పాట ‘బేబీ బ్రింగ్ ఇట్ ఆన్’ని విడుదల చేశారు.. ఈ సాంగ్ కు జనాలకు విపరీతంగా నచ్చేసిందని తెలుస్తుంది.. సాంగ్ పై మరింత జోష్ ను పెంచేందుకు ముంబై మెట్రోలో సందడి చేశారు.. అందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది..

ఈ సాంగ్ కు మెట్రోలో టీమ్ డ్యాన్స్ చేసింది.. ఫుల్ ఎనర్జీతో, కామెడీ ఎంటర్‌టైనర్‌లోని ‘బేబీ బ్రింగ్ ఇట్ ఆన్’ పాటపై ముగ్గురూ మెట్రోలో ఫ్యాన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు.. వారితో పాటు ఫ్యాన్స్ కూడా డాన్స్ స్టెప్పులు వేశారు.. వారి రాకతో మెట్రో అంతా సందడిగా మారింది.. బేబీ బ్రింగ్ ఇట్ ఆన్’ పాటను అజయ్-అతుల్ ద్వయం కంపోజ్ చేశారు.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..