Danger with Non Stick Pans : నాన్ స్టిక్ పాత్రలు చూడడానికి అందంగా ఉంటాయి. వంట చేస్తే అడుగంటకుండా.. కడిగితే త్వరగా శుభ్రమవుతాయన్న ఉద్దేశంలో ఇటీవల వాటిని విచ్చలవిడిగా వాడేస్తున్నారు ప్రజలు. వాటిని వాడితే చాలా ప్రమాదమని ఇటీవల పరిశోధకులు జరిపిన పరిశోధనలో తేలింది. వీటి వాడకం వల్ల ఉన్న హెల్త్ రిస్క్ ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్లైండర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూకాస్టిల్ కు చెందిన శాస్త్రవేత్తలు నాన్ స్టిక్ పాత్రల వాడకంపై ఓ పరిశోధన నిర్వహించారు. దీని ఫలితాలు సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్ మెంట్ లో ప్రచురితమయ్యాయి. ఈ పాత్రలకు టెఫ్లాన్ అనే కెమికల్ కోటింగ్ వల్ల ఈ నాన్ స్టిక్ గుణం వస్తుంది. ఈ పాత్రలను వాడుతుంటే శుభ్రం చేస్తున్న క్రమంలో కొంత కాలానికి ఈ కోటింగ్ కొద్ది కొద్దిగా పోతుంటుంది. ఇలా పోయే టెఫ్లాన్ కోటింగ్ రూపంలో 9,100 కెమికల్ పార్టికల్స్ మన ఆహారంలోకి చేరుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
Read Also: Kalyan Ram: కల్యాణ్ రామ్ సరసన కన్నడ బ్యూటీ
రామన్ ఇమేజింగ్ టెక్నిక్ ద్వారా సూక్ష్మ ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ విడుదలను తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. ఈ టెఫ్లాన్ మైక్రో ప్లాస్టిక్స్ ఆహారంలో కలుస్తుండడం ఆరోగ్యం విషయంలో ఆందోళన కలిగించే అంశంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూకాస్టిల్ పరిశోధకుడు డాక్టర్ చెంగ్ ఫాంగ్ పేర్కొన్నారు. వీటి కారణంగా జరిగే నష్టంపై పరిశోధన అవసరం ఉందన్నారు. టెఫ్లాన్ కోటింగ్ తొలగిపోతున్న పాత్రల నుంచి 2.3 మిలియన్ మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ కణాలు విడుదల అవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కనుక వంటలకు వినియోగించే పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని ఫ్లైండర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టాంగ్ హెచ్చరించారు.
Read Also: Vivek Ranjan Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ మరో సంచలనం