Site icon NTV Telugu

Nominations Withdraw: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

Election Commission

Election Commission

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో.. సాయంత్రం వరకు పూర్తి నామినేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం వరకు రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు 625 మంది పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. 268 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. మల్కాజిగిరి ఆర్వో పై మల్కాజ్‌గిరి పార్లమెంట్ లో నామినేషన్ వేసి తిరస్కరించబడ్డ 77 మంది స్వతంత్ర అభ్యర్థులు సీఈవోకు ఫిర్యాదు చేశారు. అత్యధికంగా మెదక్ స్థానానికి 53 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 13 మంది పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 625 నామినేషన్లు నమోదు అయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 4,120, 25 ఎంపీ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి.

 

Exit mobile version