Nokia 3210 4G Launched in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ తన ‘నోకియా’ బ్రాండ్‌పై కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘నోకియా 3210 4జీ’ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల క్రితం (1999) లాంచ్ అయిన ఈ మోడల్.. మరోసారి నోకియా ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ ధరను రూ.3,999గా హెచ్ఎండీ గ్లోబల్ నిర్ణయించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, హెచ్‌ఎండీ ఈస్టోర్ వెబ్‌సైట్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.
నోకియా 3210 4జీని మరోసారి అదే రెట్రో లుక్‌ను కొనసాగించారు. నీలం, పసుపు, నలుపు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేను ఇచ్చారు. యునిసోక్ టీ107 ప్రాసెసర్ ఉంటుంది. వెనకవైపు 2 ఎంపీ కెమెరా ఉండగా.. 64 ఎంబీ ర్యామ్ ఉంటుంది. యూట్యూబ్, యూట్యూబ్ షార్ట్స్, న్యూస్, గేమ్స్ కోసం వేర్వేరుగా యాప్స్ ఉంటాయి. ఇక అప్పట్లో చాలా ఫేమస్ అయిన స్నేక్ గేమ్‌ను నోకియా 3210 4జీలో కొనసాగించారు.
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన భారత్!
నోకియా 3210 4జీలో1450 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జింగ్‌తో 9.8 గంటల టాక్ టైం వస్తుంది. యూఎస్‌బీ టైప్-సి పోర్టుతో ఈ ఫోన్ వస్తుండడం గమనార్హం. 3.5 ఎంఎం జాక్, ఎంపీ3 ప్లేయర్, ఎఫ్‌ఎం రేడియో, డ్యూయల్ సిమ్ 4జీ voLTE సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తోంది. అప్పట్లో చాలా డిమాండ్ ఉన్న ఈ ఫోన్ అమ్మకాలు ఎలా ఉంటాయో చూడాలి.