NTV Telugu Site icon

Nokia 3210: భారత మార్కెట్‌లోకి ‘నోకియా 3210’ ఫోన్.. యూపీఐ, యూట్యూబ్‌ ఫీచర్స్ కూడా!

Nokia 3210 Price

Nokia 3210 Price

Nokia 3210 Price in India: హెఎండీ గ్లోబల్‌ సంస్థ ‘నోకియా’ బ్రాండ్‌పై స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమధ్య వెనకపడిపోయిన నోకియా.. మళ్లీ పుంజుకునేందుకు చూస్తోంది. ఈ క్రమంలో మూడు కొత్త ఫీచర్‌ ఫోన్‌లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల తర్వాత నోకియా 3210 మోడల్‌ను మళ్లీ తీసుకొచ్చింది. నోకియా 235 4జీ, నోకియా 220 4జీ పేరిట మరో రెండు ఫోన్లనూ రిలీజ్ చేసింది. యూట్యూబ్‌, యూపీఐ ఫీచర్లతో ఈ మూడు ఫోన్లు వస్తుండడం విశేషం.

నోకియా 3210 ఫోన్‌లో 1450 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 9:30 గంటల పాటు టాక్‌ టైం వస్తుందని కంపెనీ పేర్కొంది. అప్పట్లో అందరికీ నచ్చిన స్నేక్‌ గేమ్‌ ఇందులో ఉంటుంది. 2ఎంపీ కెమెరా, ఫ్లాష్‌ టార్చ్‌ సదుపాయం కూడా ఉంది. అంతేకాదు స్మార్ట్‌ఫోన్‌ తరహాలో యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పే చేసేయొచ్చు. యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌తో పాటు వెధర్‌, న్యూస్‌, క్రికెట్‌ స్కోర్‌, 2048 గేమ్‌తో సహా 8 యాప్స్‌ ఇందులో ఉంటాయి. దీని ధర రూ.3,999గా ఉంది. స్కూబా బ్లూ, బ్లాక్‌, వై2కే గోల్డ్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

Also Read: OnePlus Nord CE4 Lite 5G Price: ‘వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌’ టాప్-10 ఫీచర్స్ ఇవే!

నోకియా 235 4జీలో 2.8 ఇంచెస్ ఐపీఎస్‌ డిస్‌ప్లే, 2 ఎంపీ కెమెరా ఉంటుంది. దీని ధర రూ.3,749గా కంపెనీ పేర్కొంది. బ్లూ, బ్లాక్‌, పర్పల్‌ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. నోకియా 220 4జీ ధర రూ.3,249గా ఉంది. ఈ ఫోన్‌ టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్ట్‌తో వస్తోంది. పీచ్‌, బ్లాక్‌ రంగుల్లో ఇది లభిస్తుంది. ఈ ఫోన్లూ యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌, యూపీఐ ఫీచర్లతో వస్తున్నాయి. హెచ్‌ఎండీ సైట్, అమెజాన్‌తో పాటు ఇతర రిటైల్‌ షాపుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.