SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!

  • వృద్ధులు, చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకుని నోకియా 2360 ఫ్లిప్ ఫోన్‌ లాంచ్..
  • అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ప్రత్యేక ఎస్ఓఎస్ బటన్‌
  • ఫ్యామిలీ అసిస్ట్ ఫీచర్ ద్వారా కుటుంబ సభ్యులు దూరం నుంచే ఫోన్ సెట్టింగ్స్..
Nokia 2360 Flip

Nokia 2360 Flip

Nokia 2360 Flip: హెచ్‌ఎండీ (HMD) సంస్థ కొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకవచ్చింది. నోకియా 2360 ఫ్లిప్ (Nokia 2360 Flip) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, సులభంగా మొబైల్ ఉపయోగించాలనుకునే వారి కోసం తయారైంది. క్లామ్‌షెల్ డిజైన్‌తో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే SOS బటన్, కుటుంబ సభ్యులు దూరం నుంచే ఫోన్ సెట్టింగ్స్ మార్చుకునేలా చేసే “ఫ్యామిలీ అసిస్ట్” (Family Assist) ఫీచర్‌ను ఇందులో అందించింది.

ఈ ఫోన్‌లోని ఫ్యామిలీ అసిస్ట్ ఫీచర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దీని ద్వారా అనుమతి పొందిన కుటుంబ సభ్యులు దూరం నుంచే ఫోన్ వాల్యూమ్‌ను మార్చవచ్చు. కొత్త కాంటాక్ట్స్‌ను జోడించడంతో పాటు రోజువారీ రిమైండర్లను కూడా షెడ్యూల్ చేయవచ్చు. ఇందుకోసం ఫోన్‌ను నేరుగా చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టెక్నాలజీపై ఎక్కువ అవగాహన లేని వృద్ధులకు ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే భద్రత కోసం ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేక SOS బటన్‌ను అందించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ బటన్ నొక్కితే ముందుగా ఎంపిక చేసిన ప్రాథమిక కాంటాక్ట్‌కు ఆటోమేటిక్‌గా ఫోన్ కాల్ వెళ్తుంది. అంతేకాకుండా మరో ఐదుగురు వరకు ముందుగా ఎంపిక చేసుకున్న వ్యక్తులకు అత్యవసర SMS అలర్ట్స్ కూడా పంపిస్తుంది. దీంతో అవసరమైన సమయంలో కుటుంబ సభ్యులకు సమాచారం చేరుతుంది.

నోకియా 2360 ఫ్లిప్‌లో 2.8 అంగుళాల QVGA ప్రధాన డిస్‌ప్లేను అందించారు. ఇది 320 x 240 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. ఫోన్ బయటివైపు 1.77 అంగుళాల QQVGA సెకండరీ డిస్‌ప్లే కూడా ఉంది. ఇందులో నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. 4MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా.. మైక్రో SD కార్డు ద్వారా 32GB వరకు మెమరీని పెంచుకోవచ్చు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో FM రేడియో, MP3 ప్లేయర్ ఉన్నాయి. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో పాటు.. కనెక్టివిటీ కోసం USB టైపు-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను అందించారు.

బ్యాటరీ విషయానికి వస్తే.. నోకియా 2360 ఫ్లిప్‌లో 1,450mAh రిమూవబుల్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 15 రోజుల స్టాండ్‌బై టైమ్, 27.5 గంటల వరకు టాక్‌టైమ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. చార్కోల్, టీల్, బర్గండీ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. అయితే నోకియా 2360 ఫ్లిప్ ధర, విక్రయాలు ప్రారంభమయ్యే తేదీ, ఏయే దేశాల్లో అందుబాటులోకి వస్తుందనే వివరాలను ఇంకా వెల్లడించలేదు కంపెనీ.