Nobel Prize in Chemistry 2025: ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి 2025ను సుసుము కిటగావా (Susumu Kitagawa), రిచర్డ్ రాబ్సన్ (Richard Robson), ఒమర్ ఎం. యాగీ (Omar M. Yaghi)లకు ప్రదానం చేశారు. వీరికి ఈ ప్రతిష్టాత్మక బహుమతి “మెటల్–ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (Metal–Organic Frameworks)” అభివృద్ధిలో చేసిన విప్లవాత్మక కృషికి దక్కింది. స్వీడన్ లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రంలో కొత్త రకమైన మాలిక్యులర్ ఆర్కిటెక్చర్‌ను రూపుదిద్దారని తెలిపింది. వీరు సృష్టించిన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌లో పెద్ద క్యావిటీస్ ఉంటాయి. వీటిలో మాలిక్యూల్స్ లోపలికి, వెలుపలికి ప్రవహించగలవు.
Pakistan: పాకిస్తాన్‌లో సైనిక ఆపరేషన్.. 11 మంది సైనికులు, 19 మంది ఉగ్రవాదులు హతం..
ఈ ఫ్రేమ్‌వర్క్స్ సాంకేతికతను పరిశోధకులు ప్రస్తుతం అనేక కీలక రంగాల్లో వినియోగిస్తున్నారు. ఎడారి గాలిలో నుండి నీటిని సేకరించడం, నీటిలోని కాలుష్యాలను తొలగించడం, కార్బన్ డయాక్సైడ్‌ను సేకరించడం, హైడ్రోజన్ నిల్వ చేయడం వంటి పర్యావరణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ “మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధి ద్వారా ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రవేత్తలకు కొత్త అవకాశాలు, సవాళ్లకు పరిష్కారాలు అందించారని పేర్కొంది.
KA Paul: బీసీల కోసం పార్టీ పెట్టా.. కుల కుటుంబ పార్టీలను ఓడించేందుకు మా పార్టీలో చేరండి
ఈ బహుమతిని జపాన్‌కు చెందిన కియోటో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సుసుము కిటగావా, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన రిచర్డ్ రాబ్సన్, అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఒమర్ యాగీ సమాన భాగస్వామ్యంగా పొందనున్నారు. ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులు రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, సాహిత్యం, వైద్యశాస్త్రం, శాంతి (Peace), ఆర్థిక శాస్త్రం విభాగాల్లో ప్రదానం చేయబడతాయి.
