Site icon NTV Telugu

Amartyasen: నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌కు కరోనా పాజిటివ్

Amartya Sen

Amartya Sen

భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంద‌ని తెలుస్తోంది. అయితే వైద్యుల సలహా మేరకు దేశ రాజధాని ఢిల్లీ శాంతినికేతన్‌లోని తన ఇంటిలో ఐసోలేష‌న్ ఉండి చికిత్స పొందుతున్నారు. అమర్త్యసేన్‌ శనివారం శాంతినికేతన్ ఇంటి నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. ఆయన కోల్‌కతాలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. జూలై 10న లండన్ వెళ్లాల్సి ఉండగా.. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని అమర్త్యసేన్ రద్దు చేసుకున్నారు.

Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రకటనలను నిలిపివేసిన వివో.. కారణం ఏంటంటే..?

జూలై 1న శాంతినికేతన్‌లోని తన ఇంటికి అమర్త్యసేన్ వచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల తర్వాత ఆయ‌న ఆరోగ్యం బాగోలేదని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆయ‌న వైద్యులను సంప్రదించారని, క‌రోనా ప‌రీక్షలు నిర్వహించ‌గా, పరీక్షలో అమ‌ర్త్యసేన్ కు కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కాగా శనివారం దేశవ్యాప్తంగా 2,693 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో దేశం మొత్తం 16,104 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు సుమారు 98.51 శాతానికి పెరిగింది.

Exit mobile version