NTV Telugu Site icon

Vijay Deverakonda: ఏంటి కొండన్న రూటు మార్చేశావు.. వర్కౌట్ అవుతుందా?

Vijy Dnew

Vijy Dnew

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోకపోయిన ఓ మాదిరిగా ఆకట్టుకుంది.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటించనున్నాడు.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న యాక్షన్ డ్రామాపై దృష్టి పెట్టాడు విజయ్. ఈ చిత్రంలో పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

విజయ్ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం విజయ్ కొత్త ప్రయోగం చేస్తున్నాడు.. ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఉండదట. సాధారణంగా సినిమా సక్సెస్‌లో పాటలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.. కానీ ఈ కొత్త సినిమాలో మాత్రం ఒక్క పాట కూడా ఉండదట.. ఇప్పటివరకు విజయ్ సినిమాల్లో పాటలు సూపర్ టాక్ ను అందుకున్నాయి.. మరి పాటలు లేకుండా ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి..

ఇక ఈ సినిమాకు అనిరుద్ చక్కటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడీగా ‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజుని తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.. అలాగే మరోవైపు రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్.. ఈ ఇద్దరిలో ఏ భామ విజయ్ తో రొమాన్స్ చేస్తారో చూడాలి…

Show comments