మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఎన్నికల సందర్భంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో వచ్చే సోమవారం లేదా అంతకంటే ముందుగా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు తెలిపింది. ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ జార్ఖండ్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హేమంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: Swati Maliwal assault: ఇదంతా బీజేపీ కుట్ర.. స్వాతి మలివాల్ కేసుపై ఆప్..
ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును కోరారు. అందుకు శుక్రవారం విచారించేందుకు కోర్టు నిరాకరించింది. న్యాయమూర్తులు సంజీవ్ కన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని వచ్చే మంగళవారం (21) వెకేషన్ బెంచ్ ముందు జాబితా చేయాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Shubman Gill: సంస్కారం అంటే ఇదే.. అభిషేక్ తల్లి పాదాలకు నమస్కరించిన శుభ్‌మన్.. వీడియో వైరల్
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు జనవరి 31న అరెస్ట్ చేశారు. పలుమార్లు ఈడీ కస్టడీకి ఇచ్చిన అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన్ను జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే అరెస్ట్‌కు ముందు హేమంత్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. హేమంత్ వారసుడిగా చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ భార్య.. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ బైపోల్‌లో పోటీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Suriya: కొత్త వివాదంలో హీరో సూర్య.. అసలేమైందంటే?
