Site icon NTV Telugu

kejriwal: కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్.. పిటిషన్ తిరస్కరణ

Relif

Relif

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. అరెస్ట్, ఈడీ కస్టడీపై ఆదివారం లోపు అత్యవసర విచారణ జరపాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయస్థానం తిరస్కరించింది. హోలీ పండుగ కారణంగా సోమ, మంగళవారాల్లో కోర్టుకు సెలవు ఉన్నందున మార్చి 27వ తేదీ బుధవారమే కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో మరోసారి కేజ్రీవాల్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.

కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు తాజాగా నిరాకరించింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది. మార్చి 28 వరకు ఈడీ కస్టడీ విధించటం చట్టవిరుద్ధమని కేజ్రీవాల్‌ న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మార్చి 24 ఆదివారంలోపు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషన్‌లో కోరారు. అత్యవసర విచారణ కోసం కేజ్రివాల్ తరపు అడ్వకేట్ ప్రయత్నం చేశారు. కానీ ఢిల్లీ హైకోర్టు అత్యవసరణ విచారణకు అనుమతించకపోవటంతో ఆప్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను గురువారం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు.. ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా.. విచారణ చేపట్టేందుకు కోర్టు నిరాకరించింది.

Exit mobile version