NTV Telugu Site icon

APERC: విద్యుత్ ఛార్జీల టారిఫ్ విడుదల చేసిన ఏపీఈఆర్సీ.. వారికి గుడ్‌న్యూస్‌..

Aperc

Aperc

APERC: విద్యుత్‌ ఛార్జీల టారిఫ్‌ విడుదల చేసింది ఏపీ ఈఆర్సీ.. ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపు లేదని ఈ సందర్భంగా ప్రకటించారు ఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్‌ రామ్ సింగ్.. 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల టారిఫ్‌లను ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఛైర్మన్‌ ఈ రోజు తిరుపతిలో విడుదల చేశారు.. మార్చి 31 లోపు విద్యుత్ ఛార్జీల టారిఫ్ విడుదల చేయాలి.. కానీ, ఫిబ్రవరిలోనే చేస్తున్నాం అని ఈ సందర్భంగా వెల్లడించారు ఠాకూర్‌ రామ్‌సింగ్‌.. ఏ విభాగంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు.. మూడు డిస్కమ్ ల ద్వారా రాబడి రూ.44,323 కోట్లుగా అంచనా వేశామని.. మూడు డిస్కమ్ ల పరిధిలో వ్యయం అంచనా రూ. 57, 544 కోట్లుగా ఉండొచ్చని పేర్కొన్నారు.. రాబడి, వ్యయాల మధ్య అంతరం రూ. 12,632 కోట్లుగా ఉండొచ్చని.. అంతరాన్ని భరించడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.. దీంతో గృహ వినియోగదారుల టారిఫ్ పెంపు లేదని ఈఆర్సీ ప్రకటించింది.. వ్యవసాయం, ఉద్యోగుల నర్సరీలు, ఆక్వా కల్చర్ రైతులు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్, రాయితీలకు సంబంధించి ఆమోదం తెలిపింది ఈఆర్సీ.. స్వల్పకాలిక విద్యుత్ అవసరాల కోసం వాస్తవిక అంచనా కోసం డిస్పాచ్ ద్వారా నిర్ణయం తీసుకున్నారు.. రైలు, నౌక మార్గాల ద్వారా బొగ్గు సేకరణ కోసం ఏపీ జెన్కోకు అనుమతించింది ఏపీఈఆర్సీ..

Read Also: Minister Narayana: ముంబైలో మంత్రి నారాయణ, సీఆర్టీఏ కమిషనర్‌.. MMRDAతో భేటీ..