Site icon NTV Telugu

No More Weddings : ఆ గ్రామంలో పెళ్లిళ్లు నిషేధం.. బోర్డులు పెట్టిన గ్రామస్తులు

Marriage

Marriage

No More Weddings : పెళ్లంటే జీవితంలో ఒక్కసారి చేసుకునే పెద్ద కార్యం. అలాంటి కార్యాన్ని అట్టహాసంగా జీవితాంతం గుర్తుండిపోయేలా ఆహ్లాదకర ప్రదేశాల్లో చేసుకోవాలని అనుకుంటారు. కానీ కోవిద్ సమయంలో బ్రిటన్‌లో మితిమీరుతున్న పెళ్లిళ్లపై అక్కడ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవద్దంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. బ్రిటన్‌లోని ఉత్తర నార్ఫోక్‌లో ఈ సంఘటన జరిగింది. ఇక్కడి చారిత్రక ఆక్స్‌నీడ్ హాల్ ఎస్టేట్ ఉన్నత స్థాయి వివాహాలు, పార్టీలు, సందడికి ప్రత్యేక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అయితే, వివాహాలు, వేడుకల సందర్భంగా తమ తోటలలో మూత్ర విసర్జన చేసి వాటిని నాశనం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అలాగే మ్యూజిక్‌ వల్ల రాత్రి పూట తమకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ‘ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవద్దంటూ’ బోర్డులు ఏర్పాటు చేశారు. వధువరులకూ స్వాగతం పలకబోమని హెచ్చరించారు. ఈ ఏడాది వందకుపైగా పెళ్లిళ్లు జరిగాయని, ఇక చాలని అందులో పేర్కొన్నారు.

Read Also: Colour Change Dress: ఎండకు రంగులు మారే వెరైటీ డ్రెస్

16వ శతాబ్దానికి చెందిన నార్ఫోక్ హాల్ ఖరీదైన వివాహాలు, వేడుకలకు కేంద్రంగా మారింది. గత కొంత కాలం వరకు తక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరిగేవి. అయితే కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక మాంద్యం నుంచి కోలుకునేందుకు అపరిమిత సంఖ్యలో పెళ్లిళ్లు, వేడుకలకు స్థానిక పాలక మండలి అనుమతించింది. దీంతో లెక్కకు మించి పెళ్లిళ్లు, వేడుకలు జరుగుతున్నాయి.

Read Also: Rahul Gandhi complaint to Elon Musk : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‎కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫిర్యాదు

మరోవైపు ఈ ఎస్టేట్‌ పక్కనే 500 ఎకరాల ఫార్మ్‌ కలిగిన సుసి, రోజర్ క్రేన్ ఈ పెళ్లిళ్లు, వేడుకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితంపై ఇవి ప్రభావం చూపుతున్నాయని వాపోయారు. పెళ్లికి వచ్చే అతిథులు తమ తోటల్లో తిరుగుతూ మూత్ర విసర్జన చేసి వాటిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే మ్యూజిక్‌ వల్ల రాత్రి వేళ తమకు నిద్రపట్టడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో ఇక ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవద్దంటూ కారు పార్కింగ్‌ సమీపంలో మూడు బోర్డులను ఏర్పాటు చేశారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను అందులో పేర్కొన్నారు.

Exit mobile version