NTV Telugu Site icon

No Leave in 74 Years: సూపర్ వుమెన్.. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా 74 ఏళ్ల పాటు డ్యూటీ!

Melba Mebane Leave

Melba Mebane Leave

90 Years Old Women Melba Mebane retires after 74 years having never missed a single day of duty: ప్రస్తుతం ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు ఎప్పుడు ‘లీవ్’ పెడదామా? అని చూస్తుంటారు. అందుకు ఉన్న కారణాలన్నింటిని వెతుకుతుంటారు. దగ్గు, జలుబు అంటూ.. చిన్న సమస్యకు కూడా సెలవులు పెట్టేస్తుంటారు. అయితే ఓ బామ్మ మాత్రం ఏకంగా 74 ఏళ్ల పాటు లీవ్ పెట్టకుండా జాబ్ చేశారు. 7 దశాబ్దాల పాటు పని చేసిన ఆమె ఇటీవలే 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ తీసుకున్నారు. మీరు చూస్తుంది నిజమే.. అమెరికాలో 90 ఏళ్ల వృద్ధురాలు నిర్విరామంగా పని చేశారు. వివరాలు చూద్దాం.

టెక్సాస్‌కు చెందిన మెల్బా మెబానే అనే ఆ మహిళకు ప్రస్తుతం 90 ఏళ్లు. 1949లో టెక్సాస్‌లో ‘మేయర్ అండ్ ష్మిడ్’ స్టోర్‌లో మెల్బా ఉద్యోగంలో చేరారు. స్టోర్‌లో లిఫ్ట్ ఆపరేటర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు. 1956లో ఆ సంస్థను ‘డిలార్డ్‌’ కొనుగోలు చేసింది. లిఫ్ట్‌ ఆపరేటర్‌గా ప్రయాణం మొదలెట్టిన మెల్బా.. ఆ తరువాత దుస్తులు, కాస్మెటిక్స్ విభాగంలో సుదీర్ఘకాలం పని చేశారు. ఏకంగా 74 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు.

Also Read: Janhvi Kapoor Tamil Debut: జాన్వీ కపూర్‌కి గోల్డెన్‌ చాన్స్‌.. కోలీవుడ్‌ యువ హీరోతో సినిమా! నిర్మాత కమల్

ఇక్కడ విశేషం ఏంటంటే.. మెల్బా మెబానే ఈ 74 ఏళ్లలో ఒక్క రోజు కూడా లీవ్ పెట్టలేదు. గత నెలలోనే ఆమె రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సహోద్యోగులు మెల్బాకు భారీ ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. ఇందుకుసంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది. విషయం తెలిసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇదెలా సాధ్యం అయిందని తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు ‘సూపర్ వుమెన్’ అంటూ మెల్బాను ప్రశంసిస్తున్నారు.

రిటైర్మెంట్ సందర్భంగా మెల్బా మెబానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇంట్లో కంటే ఎక్కువ సమయం తాను స్టోర్‌లోనే గడిపానని గుర్తు చేసుకున్నారు. ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన మెల్బా కేవలం సేల్స్‌ మహిళే కాదు.. గొప్ప మాతృమూర్తి అని అని డిలార్డ్‌ స్టోర్‌ మేనేజర్‌ అన్నారు. పని చేసిన అన్ని విభాగాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు.

Also Read: Asian Games 2023 BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఏషియన్ గేమ్స్ 2023లో టీమిండియా!

Show comments