NTV Telugu Site icon

Laptop Import Ban: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌ల దిగుమతిపై నిషేధం లేదు.. కొత్త రూల్స్ జారీ

Laptop Tablets

Laptop Tablets

Laptop Import Ban: మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతిని నిషేధించాలని ఒక రోజు ముందు అంటే 2023 ఆగస్టు 3, గురువారం నాడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతికి సంబంధించి కొత్త నిబంధనలను విడుదల చేయనున్నట్టు సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

దేశంలో నమ్మకమైన హార్డ్‌వేర్ వ్యవస్థలను నిర్ధారించడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ కేటగిరీల ఉత్పత్తుల్లో దేశీయంగా తయారీని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. దిగుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం కంపెనీలకు మరికొంత సమయం ఇవ్వవచ్చు. ట్విటర్‌లో ఒక వినియోగదారుకు స్పందిస్తూ, ఇది లైసెన్స్ కు సంబంధించిన విషయం కాదని, దిగుమతులను నియంత్రించే విషయమని అన్నారు. దీనికి ప్రతిగా నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే దిగుమతులపై ఎలాంటి నిషేధం విధించలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కంపెనీలు, వ్యాపారులు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఐటీ హార్డ్‌వేర్‌లను దిగుమతి చేసుకోవచ్చు.

చదవండి: World Archery Championships 2023: విల్లు ఎక్కుబెట్టిన తెలుగమ్మాయి.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం!

చదవండి: Andrapradesh : తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం..చెట్టును ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి..

ప్రభుత్వ నిర్ణయంతో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల ధరల్లో ఎలాంటి పెంపుదల ఉండదని, అలాగే వీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటిని దిగుమతి చేసుకునేందుకు కేవలం 5 నిమిషాల్లోనే లైసెన్స్‌ను జారీ చేస్తామని చెప్పారు. డీజీఎఫ్‎టీ ఆన్‌లైన్ లైసెన్స్ పోర్టల్ సిద్ధంగా ఉంది. ఇది వచ్చే ఏడాది వరకు చెల్లుబాటు అవుతుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, కంప్యూటర్‌ల దిగుమతిని కఠినతరం చేయడం ద్వారా చైనాతో భారత్ వాణిజ్య లోటును తగ్గించడంతోపాటు దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు.