NTV Telugu Site icon

Telangana Flood Effect : గోదావరి ఆగ్రహానికి గోవులు గడ్డి కరువు..

Goshala

Goshala

No Food For Goshal Cows in Bhadradri District Due Telangana Flood Effect.

గత వారం కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలో జనజీవనం అస్థవ్యస్థమైంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ పలు గ్రామాలు జలదిగ్బంధం చిక్కకున్నాయి. అయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పంటలు, ఇళ్లు సైతం వరద నీటితో నిండిపోయాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతాలకు వెళ్లారు. అయితే మనుషులు పరిస్థితి ఇలా ఉంటే.. మూగజీవల పరిస్థితి మరి ఘోరంగా ఉంది. ఉవ్వెత్తున వచ్చిన గోదావరి వల్ల గోదావరి పరివాహక ప్రాంతాల్లో జంతు జాలాలకి బతకడమే కష్టమైంది. గోవులకు నిలువ నీడ లేకుండా పోయింది. భద్రాచలం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐదు వరకు గోశాలలు ఉన్నాయి.

Telangana Floods : చీకటిలోనే పర్ణశాల రాముల వారి పూజలు

ఈ గోశాలలో కొన్ని మునిగిపోయాయి. మునిగి పోయిన గోశాల నుంచి గోవులని మరోచోటికి తరలించడం ప్రారంభించారు. గోవులకి పునరావాసాన్ని గోశాల నిర్వాహకులు కల్పించినప్పటికీ ఆ గోవులకు మేత మాత్రం దొరకడం లేదు. గడ్డి అంతా తడిచిపోయింది. గడ్డి మునిగి పోయింది. ఇప్పుడు ఎవరు గడ్డిని దానం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. గడ్డి దొరకక గోవులు నానా అగచాట్లు పడుతున్నాయి. గోశాల నిర్వాహకులు గడ్డి కోసం పలు ఇబ్బందులు పడుతున్నారు.