NTV Telugu Site icon

NEET Controversy: నీట్ వివాదంపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి.. ఏమ్మన్నారంటే..?

Darmendra

Darmendra

NEET-UG 2024: దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్‌ పరీక్ష కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. క్వశ్చన్ పేపర్ లీక్‌ అయినట్లు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితాల తర్వాత 67 మంది స్టూడెంట్స్ కు మొదటి ర్యాంకు రావడంతో పాటు హర్యానాలో ఒకే పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసిన విద్యార్థులకు అత్యధిక మార్కులు రావడంతో ఆందోళన మొదలైంది. దీంతో గ్రేస్ మార్కుల వల్లే ఇలా జరిగిందని పలువురు స్టూడెంట్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Read Also: Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరగా పంపిణీ చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

అయితే, నీట్-యూజీ2024 పరీక్షపై సుప్రీంకోర్టులో విచారణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్2024 ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. నీట్ పరీక్షకు సంబంధించి, 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.. 1,500 మంది విద్యార్థులకు సంబంధించిన సమస్యను తాము పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. పేపర్ లీకేజీపై ప్రధాన న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది.. దేశంలో నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలను ఎన్టీఏ విజయవంతంగా నిర్వహిస్తోంది అని వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు బాధ్యులైన వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

Read Also: Virat Kohli: ముందుండి అసలు పండగ.. కాస్త ఓపిగ్గా ఆడు విరాట్: సన్నీ

ఇక, ఇదిలా ఉంటే ఈ రోజు సుప్రీం కోర్టులో నీట్ పై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్‌ ముందు కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కను అగర్వాల్ తన వాదనలు వినిపించారు. జూన్ 12 న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ఏర్పాటు చేసిన ప్యానెల్ విద్యార్థుల భయాలను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులను అందించడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని కేంద్ర కమిటి తెలిపింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత 1563 మంది స్టూడెంట్స్ యొక్క స్కోర్‌కార్డులను రద్దు చేసేందుకు సిఫారసు చేయడం మంచిదన్నారు. అలాగే, వారి అసలు మార్కులను (గ్రేస్ మార్కులు లేకుండా) తెలియజేస్తామని కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ధారించింది. అలాగే వీరికి జూన్ 23 పరిక్ష నిర్వహించి.. 30న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. అలాగే, నీట్2024 కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగుతుందన్నారు.