యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్‘ . ఈ సినిమా గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ విషయంలో మార్పులు చేస్తున్నారని అందుకే షూటింగ్ షెడ్యూల్స్ క్యాన్సిల్ అయ్యాయని వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించింది.
Also Read : Ranjan : కోర్ట్ తమిళ రీమేక్.. వెండితెర ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
ఎన్టీఆర్-నీల్ సినిమా షెడ్యూల్స్ రద్దయ్యాయనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మేకర్స్ స్పష్టం చేస్తూ “సినిమా అనుకున్న ప్లాన్ ప్రకారమే సాగుతోంది. కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని మరో షెడ్యూల్ ప్రారంభించడానికి మధ్య ఉండే రొటీన్ ప్రిపరేషన్ గ్యాప్ మాత్రమే ఇది. ఎన్టీఆర్ లుక్ గురించి గానీ షూటింగ్ వాయిదా గురించి గానీ వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే”. అన్ అఫీషియల్ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని అభిమానులు ఇలాంటి అనధికారిక వార్తలను నమ్మవద్దు. సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్‌ను అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే తెలియజేస్తామని అప్పటివరకు వేచి ఉండాలని’ అని టీమ్ వెల్లడించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కేరళ కత్తి యుద్ధం కలరిపట్టు వంటి యుద్ధ విద్యలలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేసుకున్న చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ కోసం భారీ సెట్టింగ్స్‌ను సిద్ధం చేస్తోంది. నీల్ మార్క్ ఎలివేషన్స్ మరియు తారక్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్.
