Site icon NTV Telugu

RBI Policy: ఆర్బీఐ పాలసీ వచ్చేసింది.. ఈఎంఐ దారులకు నిరాశ

Rbi

Rbi

ఆర్బీఐ పాలసీ వచ్చేసింది. వడ్డీ రేట్లను ఆర్బీఐ యథతథంగా ఉంచింది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రేపో రేటు మార్చలేదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ.. 2026 క్యాలెండర్ ప్రకారం మొదటి ద్రవ్య విధాన సమీక్ష శుక్రవారం నిర్వహించింది. సమీక్ష అనంతరం రెపోరేటును 5.25 శాతం దగ్గరే ఉంచినట్లుగా ఆర్బీఐ పేర్కొంది. దీంతో ఈఎంఐల్లో ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో లోన్ వినియోగదారులకు ఎలాంటి ఊరట లభించలేదు.

ఇది కూడా చదవండి: Punjab: జలంధర్‌లో కాల్పులు.. ఆప్ నాయకుడు ఒబెరాయ్ హత్య

శుక్రవారం ఆర్బీఐ పాలసీని గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. అయినా కూడా స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి మార్పు రాలేదు. వరుస నష్టాల్లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి 83,071 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 25,554 దగ్గర కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Keir Starmer: ప్రమాదంలో యూకే ప్రధాని స్టార్మర్!.. ఎప్‌స్టీన్ ఫైల్‌‌‌పై అడ్వాన్స్‌గా క్షమాపణలు

 

Exit mobile version