Mizoram Capital: మిజోరాంలో ఐజ్వాల్‌ను రాష్ట్ర రాజధానిగా మార్చి తెన్జాల్ కు తరలించనున్నారా? అనే అంశంపై తీవ్ర ఆరోపణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ విషయమై మిజోరం ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఐజ్వాల్ నుంచి తెన్జాల్ కు రాజధాని మార్పు జరగదని ఖచ్చితంగా పేర్కొంది. ఈ వార్తలన్నీ ఓ “క్లరికల్ ఎర్రర్” వల్ల తలెత్తిన తప్పు భావన అని ప్రభుత్వం తెలిపింది.
Jair Bolsonaro: మాజీ అధ్యక్షుడుకి సుప్రీం కోర్ట్ షాక్.. హౌస్ అరెస్ట్‌కి ఆదేశాలు!
ఈ వివాదానికి అసలు కారణం ఏంటంటే.. ఏప్రిల్ 24న కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ మిజోరాం ప్రభుత్వానికి పంపిన లేఖలో ‘ఐజ్వాల్ నుంచి తెన్జాల్ కు రాజధాని మార్పు’ అన్న విషయంపై DPR (Detailed Project Report) సిద్ధం చేయాలని సూచించడమే. ఇదే లేఖను ఆధారంగా తీసుకుని ప్రతిపక్ష MNF పార్టీ గట్టిగా విమర్శలు చేసింది. ముఖ్యమంత్రి లాల్దుహోమా మాటలతో రాజధాని మారుస్తున్నారనే ఆరోపణలు MNF ప్రధాన కార్యదర్శి జోడిన్‌పుయా చేశారు. అయితే, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించింది.
Jammu Kashmir : జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా?
ఆ లేఖలో “రాజధాని మార్పు” అనే మాట తప్పుడు టైపింగ్ వల్ల వచ్చిందని, అసలు ఉద్దేశం ‘తెన్జాల్ పీస్ సిటీ ప్రాజెక్ట్’ కోసం DPR రూపొందించడమేనని వివరణ ఇచ్చింది. ఇందుకోసం కేంద్రం రూ.10 కోట్లు మంజూరు చేసింది కూడా అని స్పష్టం చేసింది. తెన్జాల్ అనేది ఐజ్వాల్‌కు సుమారు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం. ఇది సీఎం లాల్దుహోమా ఎన్నికైన సెర్చిప్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే ఆయన 2018, 2023 ఎన్నికల్లో ఇక్కడినుంచి విజయం సాధించారు. ఏప్రిల్ 4న లాల్దుహోమా మాట్లాడుతూ.. తెన్జాల్ ను పీస్ సిటీగా అభివృద్ధి చేయాలని, అక్కడ దాదాపు 10 లక్షల మందికి గృహవసతి కల్పించే ప్రణాళిక ఉందని ప్రకటించారు. ఇందుకు కేంద్రం నుంచి నిధుల సాయం వస్తుందనే నమ్మకం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరిగినట్టు తెలిపారు. అంతేకాకుండా 16వ ఫైనాన్స్ కమిషన్‌తోనూ ఈ అంశాన్ని చర్చించినట్టు ఆయన అన్నారు. ఇది రాజధాని మార్పు కాదు, భవిష్యత్ శాంతినగర ప్రణాళిక మాత్రమేనని స్పష్టంగా చెప్పిన ప్రభుత్వం.. నిరాధార ఆరోపణలు చేసే MNFను ప్రజలు నమ్మవద్దని కోరింది.
