NTV Telugu Site icon

Bjp Joinings: భారీగా బీజేపీలో చేరిన పసుపు ఐక్యవేదిక రైతులు

Bjp Joins

Bjp Joins

మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీలోకి చేరికలు పెరిగాయి. పసుపు రైతుల ఐక్య వేదిక నాయకులు భారీగా బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్, తరుణ్ చుగ్. వీరిలో 25 మంది గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వున్నారు. ఐక్యవేదిక అధ్యక్షులు తిరుపతిరెడ్డి సహా 900 మంది రైతులు బీజేపీలో చేరారు. నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల ఐక్య వేదిక నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీలో చేరారు. మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చేరికలు జరిగాయి.

Read Also: Prakash Raj: అమ్ముడుపోవద్దు.. ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రకాశ్ రాజ్ కామెంట్స్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సమక్షంలో వీరంతా బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్, బండి సంజయ్ వీరికి కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన 25 మంది పసుపు రైతులు వీరిలో ఉన్నారు. వీరితోపాటు దాదాపు 900 మంది రైతులు ఈరోజు బీజేపీలో చేరినట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మునుగోడులో బీజేపీ విజయం తథ్యం అన్నారు. కేసీఆర్ అవినీతి, నియంత, కుటుంబ పాలనకు చరమగీతం పాడే ఎన్నికలు కాబోతున్నయన్నారు బీజేపీ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్.. టీఆర్ఎస్ నేతలెవరూ అభ్యర్థి పేరుతో ఎన్నికలకు వెళ్లడానికి ముఖం చాలడం లేదు.. బీజేపీ మాత్రం అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పేరుతోనే ఎన్నికలకు వెళుతోందన్నారు తరుణ్ చుగ్.

Read Also: Myositis: సమంతకు వచ్చిన ‘మయోసైటిస్’ వ్యాధి అంటే ఏమిటి? లక్షణాలు ఎలా ఉంటాయి?