Nizamabad: నిజామాబాద్ జిల్లా మిట్టాపూర్‌లో జరిగిన మహిళ దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. 12 టీంలను ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని మహిళ శవం లభ్యమంటూ పోలీసులు పోస్టర్లు అతికించారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో పోస్టర్లు ముద్రించారు. వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం అదించారు. మిస్సింగ్ కేసులు నమోదైతే సమాచారం ఇవ్వాలంటూ నవీపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు. మహిళ వయసు 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఎడమ కాలి మడమపై పుట్టు మచ్చ ఉన్నట్లు గుర్తించారు. ముథోల్, మాక్లూర్, మహారాష్ట్రలోని ధర్మబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నారు. మహిళా తల భాగం, చేతి వేళ్ళు, మణి కట్టు ఇప్పటికి దొరకడం లేదు. దీంతో నగ్న మృతదేహాం కేసు మిస్టరీగా మారింది.
READ MORE: Hot Beautys : ఈ ఇద్దరు టాల్ అండ్ హాట్ ప్లాప్స్ భామలు హిట్ కొట్టేదెప్పుడు..
ఏం జరిగింది..?
నిజమాబాద్‌లోని నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో నిన్న(శనివారం) మొండెం లేని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. బాసర ప్రధాన రహదారి సమీపంలలో నగ్నంగా మహిళ మృతదేహం లభ్యమైంది. ఓ చేయి, మరో చేతి వేళ్ళు, తల తొలగించి అతి కిరాతకంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, డాగ్ స్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
